Advertisement
Google Ads BL

నరేష్ vs మెగా ఫాన్స్


సీనియర్ హీరో నరేష్ ఈ మా ఎన్నికల్లో బాగా హైలెట్ అయ్యారు. నిన్నటివరకు మా అధ్యక్షుడిగా కొనసాగిన నరేష్ పై శివాజీ రాజా దగ్గరనుండి, జీవిత రాజశేఖర్, హేమ వరకు బోలెడన్ని అలిగేషన్స్  చేసారు. అయినప్పటికీ మా అధ్యక్ష స్థానంలో ఉన్న నరేష్.. కొత్తగా ఎన్నికల్లో పోటీ చేసిన మంచు విష్ణు తరపున కృష్ణుడిగా నిలబడడం కాదు.. కృష్ణుడిగా తనకి తానే ప్రకటించేసుకున్నాడు. ఇక విష్ణు తో కలిసి ప్రెస్ మీట్స్, ఛానల్స్ లో లైవ్ అంటూ నానా హడావిడి చేసాడు. మా ఎన్నికల రోజున కూడా నరేష్ చేసిన హడావిడి అంతా ఇంత కాదు.. ఇక మెగా ఫ్యామిలీ తో వైరం పెంచుకున్నట్టే కనిపించాడు. తాజాగా మెగాస్టార్ చిరు ఓ ఈవెంట్ లో ఒక్కరి వల్ల మా ఎన్నికలు ఇంత దారుణంగా ముగిసాయి.. అని నరేష్ ని ఉద్దేశించే మాట్లాడారు అన్నారు. 

Advertisement
CJ Advs

అయితే మా ఎన్నికల్లో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా గెలుపొందగా.. నరేష్ కి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. దానితో మెగా ఫ్యామిలీ అందునా మెగాస్టార్ చిరుని ఢీ కొట్టేస్తున్నాడు. ఇండస్ట్రీ పెద్ద అంటూ ఎవరికీ వారు అనుకున్నా.. దాసరి తర్వాత ఇండస్ట్రీకి ఆయనంత పెద్ద ఎవరూ లేరు.. పెద్దాయన పోయిన తర్వాత ఆ ప్లేస్ అలాగే ఉండిపోయిందని.. చాలా మంది ఆ స్థానం కోసం ప్రయత్నించినా కూడా ఎవరికీ దక్కలేదని చెప్పిన నరేష్.. దాసరి స్థానాన్ని భర్తీ చేసే ఆ అర్హతలు మోహన్ బాబుకు ఉన్నాయని చెప్పుకొచ్చాడు నరేష్. దాసరి గారు ఉన్నా కూడా ఈ రోజు మోహన్ బాబుకు ఆ బాధ్యతలు ఇచ్చేవాడని చెప్పాడు నరేష్. ఆ తర్వాత ఇండస్ట్రీలో చిరంజీవి మాత్రమే కాదు చాలా మంది పెద్దలు ఉన్నారని.. అన్నింటికీ చిరంజీవి ఒక్కడే పెద్ద అనడం సరైంది కాదని చెప్పాడు.

అయితే నరేష్ వ్యాఖ్యలకు మెగా ఫాన్స్ మండి పడుతున్నారు. చిరంజీవి గారు ఎప్పుడు ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకోలేదు.. అలాంటప్పుడు నరేష్ ఇలా ఎందుకు మాట్లాడతాడు అంటూ నరేష్ పై మెగా ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Naresh vs Mega Fans:

Naresh Comments on Megastar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs