బుట్టబొమ్మ పూజ హెగ్డే బర్త్ డే ఈ రోజు. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పాన్ ఇండియా హీరోయిన్ గా పూజ హెగ్డే దూసుకుపోతుంది. కెరీర్ లో ఫుల్ బిజీ గా మారిన పూజ హెగ్డే కి ఫోన్ కాల్ మాట్లాడడానికి కూడా ఖాళీ లేదంటూ ఈ మధ్యనే ఓ టాలీవుడ్ దర్శకుడు సంచలనంగా మట్లాడారు. డేట్స్ ఖాళీ విషయం అలా ఉంచి.. అసలు ఫోన్ మాట్లాడే తీరిక లేకుండా పూజ హెగ్డే సినిమాల మీద సినిమాలు చేస్తుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ దసరా స్పెషల్ గా రిలీజ్ అవుతుంటే.. ప్రభాస్ తో నటించిన రాధేశ్యామ్ జనవరి లో సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ అవుతుంది.
ఈ రోజు పూజ హెగ్డే బర్త్ డే స్పెషల్ గా రాధేశ్యామ్ నుండి ప్రేరణకి స్పెషల్ బర్త్ డే విషెస్ అంటూ బ్యూటిఫుల్ లుక్ తో ఉన్న పూజ పిక్ ని రిలీజ్ చేసారు. రాధేశ్యామ్ లో ప్రకృతి గా పూజ హెగ్డే అదిరిపోయే అందాలతో కనిపిస్తుంది. వైట్ కలర్ ఫ్రాక్ తో పూజ హెగ్డే ఉన్న పిక్ ని రాధేశ్యామ్ నుండి వదిలింది టీం..