ప్రకాష్ రాజ్ మా అధ్యక్షుడిగా ఓడిపోయి మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా మారిన తర్వాత మా లో అనుకోని పరిణామాలు జరుగుతున్నాయి. ప్రకాష్ రాజ్.. మా సభ్యత్వానికి రాజీనామా చెయ్యడమే కాదు.. మా కి ఎందుకు రాజీనామా చెయ్యాల్సి వచ్చిందో అనేది తన ప్యానల్ ని నించోబెట్టి మరీ ప్రెస్ మీట్ పెట్టారు., ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. మా ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని అన్నారు. ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. మా ఫలితాలను రాత్రికి రాత్రే మార్చేశారని.. తమ ప్యానెల్‌లోని సభ్యులంతా రాజినామా చేసి పోరాడతామని ఈ ప్రెస్ మీట్ ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు స్పష్టం చేసారు. మా సభ్యత్వానికి రాజీనామా చేశాను.. దానికి మంచు విష్ణు అంగీకరించకపోతే.. నేను రాజీనామా వెనక్కి తీసుకుంటాను.. కాకపోతే ఓ షరతు. విష్ణు మా కి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసాక మా నియమ, నిబంధనలు మార్చి, తెలుగువాడు కాని వ్యక్తి మా ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని గనక మీరు రూల్స్ నేను మా లో ఉంటాను.
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌నుంచి విజయం సాధించిన నటుడు శ్రీకాంత్ కూడా తన పదవికి రాజీనామా చేసి.. మా ఎన్నికల్లో కొంతమంది ఆ ప్యానల్ నుండి గెలిచారు, కొంతమంది ఈ ప్యానల్ నుండి గెలిచారు. ఇలాంటి టైం లో మా లో పెద్ద పెద్ద గొడవలే జరిగాయి.. అలాంటప్పుడు కలిసి ఎలా పని చెయ్యగలం అందుకే రాజీనామా చేస్తున్నాం, అయినా మంచు విష్ణు కి అండగా నిలుస్తాం. మా ప్యానెల్‌లో ఉన్న వారంతా తప్పు జరిగితే ప్రశ్నించే ధైర్యవంతులు. అలాంటప్పుడు నరేష్ గారు ఉన్న ప్యానల్ లో మేము ఇమడలేం అన్నారు. ఎందుకంటే నన్ను నరేష్ గారు చాలా మాటలన్నారు.
అలాగే ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన బెనర్జీ కూడా తన పదవికి రాజీనామా చేశారు. మోహన్ బాబు నన్ను చంపుతామని బెదిరించారు. మోహన్‌బాబుగారు తనీశ్‌ను తిడుతున్నారు. ఆ టైం లో నేను విష్ణు దగ్గరకు వెళ్లి గొడవలు వద్దు నాన్నా అని అన్నాను. మోహన్‌బాబుగారు నన్ను కొట్టడానికి వచ్చేశారు.. అనకూడని మాటలతో మోహన్ నన్ను తిట్టారు. గెలిచినా విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నా అని అన్నారు. అందుకే మేము మా లో ఉండలేమంటూ మా లో ప్రకాష్ రాజ్ తరుపునుండి గెలుపొందినవారంతా రాజీనామాలు చేసారు.