Advertisement
Google Ads BL

మాటలు రావడం లేదన్న ఎన్టీఆర్


ఎన్టీఆర్ పీఆర్వో, ప్రొడ్యూసర్ మహేష్ కోనేరు ఈ రోజు ఉదయం విశాఖ పట్నంలో గుండెపోటుతో హఠాన్మరణం చెందడం అందరిని కలిచి వేసింది. పీఆర్వో గా, నిర్మాతగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మహేష్ కోనేరు మృతిపై జర్నలిస్ట్ లు, సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో తెలుగులో పలు చిత్రాలను నిర్మించిన మహేష్ కోనేరు గుండెపోటు తో మృతి చెందడం బాధాకర విషయం అంటూ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ కి కళ్యాణ్ రామ్ కి పర్సనల్ పీఆర్వో గా మహేష్ కోనేరు సుపరిచితుడు.

Advertisement
CJ Advs

అయితే మహేష్ కోనేరు మరణం పై ఎన్టీఆర్ సోషల్ మీడియా లో స్పందించారు. మహేశ్‌ కోనేరు మృతి వార్త తెలిసి షాక్‌కు గురయ్యానని.. బాధాతప్త బరువెక్కిన హృదయంతో చెబుతున్నా.. నా ఆప్త మిత్రుడు మహేశ్‌ కోనేరు ఇక లేరు. నాకు మాటలు రావడం లేదు.. అని మహేశ్‌ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా (With the heaviest of heart and in utter disbelief, I am letting you all know that my dearest friend @SMKoneru is no more. I am shell shocked and utterly speechless. My sincerest condolences to his family and his near and dear.) అంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ట్వీట్ చేసారు. 

NTR heartbroken over his PRO Mahesh Koneru demise:

Producer and Pro Mahesh Koneru passed away
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs