నటుడు ప్రకాష్ రాజ్ ఈ ఏడాది మా ఎన్నికల్లో అధ్యక్ష పీఠానికి మంచు విష్ణు పై పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఓడిపోయిన తర్వాత మంచు విష్ణు ని ఆలింగనం చేసుకున్న ప్రకాష్ రాజ్.. నిన్న మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. అయితే మంచు విష్ణు మాత్రం ప్రకాష్ రాజ్, మరొక నటుడు నాగబాబు రాజీనామాలను ఆమోదించే ప్రసక్తే లేదని, నేను వెళ్లి మాట్లాడతాను.. నాకు వాళ్ళ అనుభవం ఉపయోగపడుతుంది అని అంటున్నాడు. అయితే నిన్న మధ్యాన్నాం ప్రకాష్ రాజ్ రాజీనామా చెయ్యడమే పెద్ద షాకిస్తే.. సాయంత్రానికి మరో ట్వీట్ చేసాడు.
ఆ ట్వీట్ లో ప్రకాష్ రాజ్.. మా ప్రియమైన MAA సభ్యులు.. మాకు మద్దతుగా నిలిచిన వాళ్లందరికీ థ్యాంక్స్.. నేను మా కి ఎందుకు రాజీనామా చేశాను అంటే.. అసలు రాజీనామా చేయడం వెనుక లోతైన అర్థం ఉంది.. మీరందరూ మాకు అందించిన ప్రేమ, మద్దతు పట్ల మేము బాధ్యత వహిస్తున్నాం.. మేము మిమ్మల్ని ఎన్నటికీ నిరాశపరచము.. అతి త్వరలో అన్ని విషయాలు వివరిస్తాము. మీరు మా గురించి గర్వపడతారు అంటూ ట్వీట్ చెయ్యడంతో.. ప్రకాష్ రాజ్ మా ఎన్నికల మేటర్ ని ఇంకా వదల్లేదు అని, మా ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణాలు ఏమైనా చెబుతారా.. లేదంటే మా అధ్యక్షుడు మంచు విష్ణు గురించి రహస్యాలు ఏమైనా బయట పెడతాడా.. అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.