నాగ చైతన్య సమంత తో విడిపోక ముందు అంటే సమంత ని పెళ్లి చేసుకున్నాక మురళి మోహన్ నుండి తీసుకున్న ఇంట్లో హాయిగా ఎంజాయ్ చేసారు. అయితే సమంత తో బ్రేకప్ అయ్యాక నాగ చైతన్య ఓ నెల ముందు నుండే వేరేగా ఓ హోటల్ లో గడిపాడు అని, సమంత తో విడిపోయాక నాగ చైతన్య ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. తన లైఫ్ లో నుండి సమంత వెళ్ళిపోయాక.. వాళ్లిద్దరూ కలిసి జీవించిన ఇంటి నుండి చైతన్య వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాడట. ఇప్పటికే సమంత గచ్చిబౌలి లోని ఓ ఫ్లాట్ లో నివసిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పుడు నాగ చైతన్య కూడా మురళి మోహన్ నుండి తీసుకున్న ఇంటి కి దూరం కాబోతున్నాడట. అక్కినెయ్ ఫ్యామిలీ లోకి కూడా వెళ్ళనుకోవడం లేదట. నాగార్జున తో ఉండలేను అని, ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నాడట.. అందుకే చైతు ఓ డేరింగ్ స్టెప్ తీసుకున్నాడట.
దానిలో భాగంగానే హైదరాబాద్‌లో ఓ కాస్ట్లీ ఏరియాలో ఓ కొత్త ఫ్లాటు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఆయన అక్కడే ఒంటరిగా ఉంటాడట. చైతన్య ఎప్పుడో అంటే గత సంవత్సరం జూబ్లీహిల్స్‌లో ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే అప్పటినుండి ఆ ఇంటికిని రెన్యూవల్ చేయిస్తున్నాడట. ఇక తాజాగా సమంత నుండి విడిపోయాక చైతన్య ఆ ఇంటిని బాగు చేయించి.. ఆ ఇంటికి మారాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది.