Advertisement
Google Ads BL

రెండు నెలల నరకం


నిన్న జరిగిన మా ఎలక్షన్స్ లో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై గెలుపొందాడు. రెండు నెలలుగా మంచు విష్ణు ఇండస్ట్రీ పెద్దల చుట్టూ తిరుగుతూ.. ఆశీర్వచనాలు పొందుతూ.. ప్రకాష్ రాజ్ కౌంటర్లు కి ఎన్ కౌంటర్ వేస్తూ.. ప్రెస్ మీట్స్ పెడుతూ నానా హడావిడి చేసాడు. ఫైనల్ గా ఈ ఎన్నికల్లో మంచు విష్ణు మా అధ్యక్షుడయ్యాడు. మంచు విష్ణు గెలుపు తర్వాత ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు భారీగా జరిగాయి. ఈ ఎన్నికల్లో 650 మందికిపైగా ఓటు వేశారు. మా అధ్యక్షుడిగా తెలుగు బిడ్డను ఎన్నుకొన్నారు. ఓటర్ల తీర్పును గౌరవిస్తున్నాను. మంచు విష్ణుకు అంతా శుభం జరగాలి అంటూ ప్రకాశ్ రాజ్ భావోద్వేగంగా మీడియా తో మాట్లాడారు. అయితే ప్రకాశ్ రాజ్ మీడియా తో  మాట్లాడినంతసేపు మంచు విష్ణు తలవంచుకొని ఎమోషనల్ అయ్యారు.

Advertisement
CJ Advs

ప్రకాష్ రాజ్ తర్వాత మంచు విష్ణు మట్లాడుతూ.. మా ఎన్నికల విషయంలో గత రెండు నెలలుగా నేను నరకం అనుభవించాను. చాలా మాటలు, చాలా విమర్శించుకున్నాం, ఇక ఎప్పటికి ఇలాంటి వాతావరణం కనబడకూడదు. గెలిచినవారు, ఓడినవారంతా ఒక్కటే.. మేమంతా కలిసి పని చేస్తాం.. ఈ నా విజయంలో మా నాన్నగారి పాత్ర ఎంతో.. అసలు ఈ ఎన్నికల విషయం ఇంత దూరం వచ్చి ఉండకూడదు.. ప్రకాష్ రాజ్ అంటే చాలా ఇష్టం. నా గెలుపుకి కృషి చేసిన వారికి అందరికి ధన్యవాదాలు.. అంటూ మంచు విష్ణు కన్నీళ్లు పెట్టుకున్నాడు. మోహన్ బాబు ప్రకాష్ రాజ్ ని హాగ్ చేసుకున్నారు. మంచు విష్ణు ప్రకాష్ రాజ్ ని ఆలింగనం చేసుకున్నవి మీడియాలో హైలెట్ అయ్యాయి. 

Manchu Vishnu First Reaction On MAA Election Result After Winning:

Manchu Vishnu Cried After Winning In MAA Elections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs