Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 5: శ్రీరామ్ లవ్ కి భారీ షాక్


బిగ్ బాస్ లో రొమాన్స్ ఫుల్ గా వర్కౌట్ అవుతుంది అనే ఒకే ఒక్క కారణంగా ఈ సీజన్ లో అడుగుపెట్టిన వారు ముందే జంటలను సెట్ చేసుకోవడానికి ట్రై చేసారు. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ముదురు భామలు, పెళ్లయిన కుర్రాళ్లే అడుగుపెట్టడంతో.. రొమాన్స్ కి చోటు లేకుండా పోయింది. అయినా సింగర్ శ్రీరామ్, హమీద లు రొమాన్స్ పండించడానికి ట్రై చేసారు. లవర్స్ గా ప్రాజెక్ట్ అయ్యారు. నైట్ హాగ్స్ , మిడ్ నైట్ కిస్ లు అంటూ కాస్త ఆసక్తిని రేపారు. కానీ హమీద శ్రీరామ్ కి షాకిచ్చింది. హమీద గత రాత్రి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ ని వీడింది. వెళ్ళేటప్పుడు శ్రీరామ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. హమీద కూడా.

Advertisement
CJ Advs

వెళుతూ వెళుతూ హమీద స్టేజ్ మీద ఆర్జే కాజల్ ఫేక్ అని, చాలా నెగటివ్ షేడ్స్ ఉన్నాయని నకిలీ మనిషి అంటూ బంధాలకు ఆప్యాయతలకు కూడా విలువ ఇవ్వదు అని మొహం మీద చెప్పేసింది. ప్రియగారి విషయంలో చేసిన త్పపు దిద్దుకుని వెళుతున్నా అని, అని మాస్టర్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యా అని చెప్పిన హమీద శ్రీరామ్ విషయంలో బాగా ఫీలైంది. శ్రీరామ్ కూడా హమీద వెళ్లిపోతుంటే బాధగా ఉంది, హమీద విషయంలో నన్ను బ్లేమ్ చేసారు. కానీ నేను హమీద ఏప్పుడు నామినేషన్స్ విషయం కానీ, మరే ఇతర విషయాలు మాట్లాడలేదు.. హమీద చెబితే నేను చేశా అన్నారు. అదంతా రాంగ్ అన్నారు. ఇక హమీద కూడా శ్రీరామ్ చాలా మంచి వాడు ఇతరుల కోసం ఎంతగానో పోటీ పడతాడు అంటూ పాజిటివ్ కామెంట్ చేసింది. వెళ్ళిపోయే ముందు రోజు శ్రీరామ్ తో రాత్రి మొత్తం మాట్లాడినట్లు హామీదా తెలియజేసింది. ఇక హమీద వెళ్లిపోవడంతో హౌస్ లో శ్రీరామ్ లవ్ కూడా వెళ్ళిపోయింది అంటున్నారు నెటిజెన్స్. 

Bigg Boss 5: Huge shock to Shriram Love:

Hamida eliminated from Bigg Boss Telugu 5
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs