గత కొన్ని రోజులుగా మా ఎన్నికలలో పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు లు మధ్యన హోరా హోరి యుద్ధం జరగడమే కాదు.. మా అధ్యక్ష పదవి కోసం పర్సనల్ గా ఫామిలీస్ ని తిట్టుకుని.. సినిమాల బడ్జెట్ విషయాలను కూడా లాగేసారు. ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటూ ఈ ఎన్నికల్లో చాలామంది ఆర్టిస్ట్ లు దిగజారి ప్రవర్తించారు. ఇంత జరుగుతున్నా మెగాస్టార్ చిరు కానీ, మరో సీనియర్ హీరో కానీ ఈ మా ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదు. ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు లు ప్రెస్ మీట్స్ పెట్టి మా ఎన్నికల వ్యవహారాన్ని పర్సనల్ ఎన్నికలు, పొలిటికల్ ఎన్నికల వ్యవహారం లా మార్చేశారు.
ఇంత జరిగినా చిరు ఎప్పుడు వాటిని ఖండించలేదు. కానీ చిరంజీవి గత రాత్రి పెళ్లి సందడి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు. ఆ ఈవెంట్ లో హీరోల మధ్యన ఆహ్లాదకర వాతావరణం ఉండాలి అని, వెంకీ నారప్ప నాకు నచ్చింది.. వెంకీని అభినందించాను.. వెంకీ కి సై రా నచ్చింది.. నన్ను మెచ్చుకున్నాడు. ఇలాంటి వాతావరణం ఉంటే.. పరిశ్రమలో వివాదాలు, కొట్టుకోవడం, ఒకరినొకరు మాటలనుకోవడం, అనిపించుకోవడం ఉండదు. పదవులు తాత్కాలికం.. అవి రేడేళ్లు ఉంటాయి. లేదంటే మూడు, నాలుగేళ్లు ఉంటాయి. అనేది వేరే విషయం. పదవులు చిన్న చిన్న విషయం.. దాని కోసం మాటలు అనుకోవడం, అనిపించుకోవడం బయట వారికి ఎంత లోకువ. పదవి కోసం అంత లోకువ అవ్వాలా.. ఇది ఎక్కడ ప్రారంభమైందో గుర్తుంచుకోండి. ఎవరి కారణంగా ఈ వివాదాలు మొదలయ్యాయో ఆలోచించండి... అంటూ చిరు ఆవేశంగా మాట్లాడారు.
చిరు మాట్లాడింది అక్షరాలా నిజం. చిరు చెప్పిన ప్రతి అక్షరం వాస్తవం.. అయితే చిరు ఈ విషయం పై ఎప్పుడో మట్లాడాల్సింది. కానీ చిరు మా ఎన్నికలు పూర్తయ్యి.. అంతా సద్దుమణిగాక మాట్లాడడం చూస్తే.. చిరు టూ లేట్ అనాలనిపిస్తుంది.