ఈ రోజు టాలీవుడ్ లో జరిగిన మా ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. సీనియర్ హీరోలైన నాగార్జున, బాలకృష్ణ లాంటి హీరోలు, ఇంకా వేరే వేరే ప్రదేశాల నుండి చాలామంది హీరోయిన్స్ కూడా ఈ మా ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి వచ్చారంటే ఈ ఎన్నికలు ఎంత ఆసక్తికరంగా మారాయో అర్ధమవుతుంది. జెనీలియా అయితే ముంబై నుండి మా ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి వచ్చింది. అంత ఆసక్తికరంగా మార్చిన మా ఎన్నికల్లో కొంతమంది స్టార్స్ ఓటు వెయ్యడానికి రాలేదు. మా ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి ఆసక్తి చూపలేదు.
జీవిత చెప్పినట్టుగా ఎన్టీఆర్ ఈ మా ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి రాలేదు. అల్లు అర్జున్ ఏ షూటింగ్ లో ఉన్నాడో.. అల్లు అర్జున్ కూడా రాలేదు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా మా ఎన్నికలని అవాయిడ్ చెయ్యగా.. వెంకీ ఫ్యామిలీ నుండి వెంకీ, రానా మా ఎన్నికల్లో ఓటు వెయ్యలేదు. సూపర్ స్టార్ మహేష్ కూడా మా ఎన్నికలకి దూరంగా ఉన్నాడు. ఇంకా నితిన్, నాగచైతన్య, అల్లు అర్జున్, శర్వానంద్, సునీల్, సుమంత్, సుశాంత్, సత్యదేవ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రవితేజ లు కూడా మా ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆసక్తి కనబరచలేదు. అయితే వీరు ఏ షూటింగ్స్ లో చిక్కుకుని ఎన్నికల్లో ఓటు వెయ్యలేదో.. లేక ఇంట్రెస్ట్ లేకో ఓటు వెయ్యాలదో అనేది అభిమానుల ముందున్న పెద్ద ప్రశ్న.