రెండు రోజులుగా కాజల్ చెప్పబోయే శుభవార్త గురించి అభిమానులు ఎంతో అతృతతో టెంక్షన్ తో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత నెల రోజులుగా కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుంది అనే న్యూస్ అభిమానులని కలవరపెడుతుంది. అంటే కాజల్ తల్లి అవుతున్నందుకు బాధలేదు కానీ.. ఆమె సినిమాలకు దూరమవ్వుద్దేమో అనే భయంలో ఉన్నారు వారు. అందులోను కాజల్ అగర్వాల్ కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడం లేదు.. ఒక సినిమా నుండి కాజల్ తప్పుకుంది అనే ప్రచారం జరుగుతున్న వేళ కాజల్ ఇన్స్టా లో మీకో శుభవార్త అంటూ ట్వీట్ చెయ్యడంతో అందరూ కంగారు పడ్డారు.
అయితే కాజల్ లేటెస్ట్ గా బాలీవుడ్ లో ఓ బడా ఫ్యాషన్ షో లో మెరిసింది. భర్త గౌతమ్ కిచ్లు తో కలిసి ఫ్యాషన్ లో రాంప్ వాక్ చేసిన కాజల్.. తాను చెప్పాలనుకున్న శుభవార్త చెప్పకనే చెప్పేసింది. అయితే తాను చెప్పాలనుకున్న శుభవార్త చెప్పేసింది. అదేమిటంటే.. తన ఇంట్లోకి మూడో వ్యక్తిని ఆహ్వానించబోతున్నట్టుగా కాజల్ చెప్పడంతో.. కాజల్ తల్లి అవుతుంది అనుకునేరు అలాంటిదేం లేదు.. కాజల్ తాజాగా తన కుటుంబంలోకి ఓ కుక్కపిల్లకి స్వాగతం పలికింది. తన పేరు మియా అని తెలిపింది. ఎప్పటినుంచో ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నాము.. అంటూ కుక్కపిల్లతో ఓ ఫోటోను పంచుకుంది. దానితో కాజల్ చెప్పాలనుకున్న శుభవార్త ఇదేనా అంటూ నెటిజెన్స్ పెదవి విరుస్తున్నారు.