Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ షో కి సమంత.. ప్రోమో అదిరింది


ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కి రామ్ చరణ్ ఓపెనింగ్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చి షో పై క్రేజ్ పెంచాడు. తర్వాత జక్కన్న , కొరటాల లు వచ్చారు. ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో పై మంచి అంచనాలున్నాయి.. కానీ ఎంతగా ట్రై చేసినా షో కి టీఆర్పీ పెరగడం లేదు. అందుకే సెలెబ్రిటీ గెస్ట్ లతో షో పై అంతకంతకు హైప్ క్రియేట్ చేస్తున్నారు జెమిని వాళ్ళు. ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియా స్టార్ షో కి హోస్ట్ అంటే.. విపరీతమైన క్రేజ్ ఉండాలి, అంచనాలు ఉండాలి. దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ శాయశక్తులా ట్రై చేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక ఎన్టీఆర్ షో కి సమంత గెస్ట్ అంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా ప్రోమో తో కంఫర్మ్ చేసారు. అక్కినేని నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత సమంత ఫస్ట్ టైం టాక్ షో కి హాజరవుతుంది. దానితో అందరి చూపు ఇప్పుడు సమంత ఎపిసోడ్ మీదే ఉంది. సమంత ని ఆహ్వానిస్తూ హాట్ సీట్ కి వెల్ కం చెప్పిన ఎన్టీఆర్.. సమంత ని అందరూ 1000 నుండి కోటి గెలుచుకుంటారు.. నువ్వు కోటి నుండి 1000 కి వస్తే.. బావుంటుంది కదా ఆట .. అలా వద్దులెండి... నాకు డబ్బులు.. వద్దా అని ఎన్టీఆర్ అంటే కావాలి కావాలి అంటుంది.. సమంత. ఇక ఈ ఎపిసోడ్ దసరా స్పెషల్ గా ప్రసారం కాబోతుంది. ప్రస్తుతం సమంత - ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Samantha NTR EMK episode will be aired on Navratri:

Samantha and NTR EMK episode promo viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs