Advertisement
Google Ads BL

మా ఎన్నికల్లో ఉద్రిక్తత


టాలీవుడ్ మా ఎన్నికలు హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ వద్ద జరుగుతున్నాయి. మంచు విష్ణు - ప్రకాష్ రాజ్ లు మా అధ్యక్ష పీఠం కోసం నువ్వా - నేనా అని పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలు పొలిటికల్ ఎన్నికల వేడిని రాజేసినట్టుగా టాలీవుడ్ రెండు గ్రూప్ లుగా విడిపోయే పరిస్థితి వచ్చింది. నేడు మా ఎన్నికల్లో స్టార్ హీరోలు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వచ్చారు. బాలకృష్ణ, చిరంజీవి, రామ్ చరణ్, పవన్ ఇంకా చాలామంది హీరో - హీరోయిన్స్ మా ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి వచ్చారు. ఎన్నికల నేపథ్యంలో 50 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. తెలంగాణ కో-ఆపరేటివ్ సొసైటీ విశ్రాంత ఉద్యోగులతో పోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే మా పోలింగ్ కేంద్రం వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Advertisement
CJ Advs

ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తీరుపై మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మా ఎన్నికల పోలింగ్ కేంద్ర దగ్గర కూడా ప్రచారం చేస్తున్నారని మంచు విష్ణు ఆరోపిస్తున్నారు. నమూనా బ్యాలెట్ ఇస్తున్న శివారెడ్డిని శివబాలాజీ అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ప్యానెల్‌ సభ్యులు కాకుండా బయటి వ్యక్తులు లోపలికి రావడంపై విష్ణు ప్యానెల్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఇతరులు లోపలికి రావడంతో ఈ గందరగోళ పరిస్థితి నెలకొంది. మాస్క్‌ పెట్టుకున్న వ్యక్తి ఎవరో తెలియదని.. అందుకే ఆ వ్యక్తిని విష్ణు ప్యానెల్‌ అడ్డుకుంది. దానితో పోలీస్ లు జోక్యం చేసుకుని ఇరు వర్గాల సభ్యులతో మాట్లాడి .. గొడవ సద్దుమణిగేలా చేసారు. అలాగే  ప్రకాశ్‌రాజ్‌ గన్‌మెన్లను కూడా పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించేది లేదని ఎన్నికల అధికారి తెలిపారు.

మరోపక్క మంచు మోహన్ బాబు గేటు బయట ప్రచారం చేసుకోవాల్సిందిగా వాగ్వాదానికి దిగారు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు చేస్తున్నారు అంటూ అయన ఫైర్ అయ్యారు.. అలాగే శివబాలాజీ-హేమల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

High Tension Over MAA Elections 2021:

Tension in Maa elections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs