ఈ రోజు టాలీవుడ్ లో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఎప్పుడూ మా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేవి. కానీ ఈసారి ప్రకాష్ రాజ్ ప్యానల్ - మంచు విష్ణు ప్యానల్స్ మధ్యన పోటీ హీటెక్కింది. దానితో సెలబ్రిటీస్ కూడా మా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మా ఎన్నికలని ఎక్కువగా స్టార్ హీరోలు అవాయిడ్ చేసేవారు. కానీ ఈసారి స్టార్ హీరోలు మా ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి వచ్చి షాకిచ్చారు. మెగా ఫ్యామిలిలో ఉన్న స్టార్ హీరోస్ మరే ఫ్యామిలిలో లేరు. అయితే మెగా ఫ్యామిలీ సపోర్ట్ నాగబాబు ప్రకాష్ రాజ్ కే మా మెగా ఫ్యామిలీ సపోర్ట్ అంటే.. మంచు విష్ణు మెగా ఫ్యామిలీ అంతా నా వెనుకే ఉంది అంటాడు. మధ్యలో శ్రీకాంత్, జీవిత, రాజీవ్ కనకాల, హేమ, కరాటే కళ్యాణి, సీవీఎల్ నరసింహ రావు లు పర్సనల్ ప్రెస్ మీట్స్ మా ఎలేచ్షన్స్ ని హీటెక్కించారు. ఇక నేడు మా ఎన్నికల టైం.
ఈ ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలు రావడం శుభసూచకం. మా ఎన్నికల్లో ఓటు వేసిన పవన్ కల్యాణ్ తాను ఎవరికి ఓటు వేశానో చెప్పనన్నారు. అంతేకాకుండా అన్నయ్య చిరంజీవి, మోహన్‌బాబు మంచి స్నేహితులని, రాజకీయాలపై మా ఎన్నికలు ఎలాంటి ప్రభావాన్ని చూపబోవని అన్నారు. ఈ ఎన్నికల కారణంగా సినీ ఇండస్ట్రీ విడిపోవడమనేది ఉండదని పవన్ కుండబద్దలు కొట్టారు. ఈసారి మా ఎలక్షన్స్ కాకపుట్టించడమే కాదు.. ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తించాయి. మంచు విష్ణు - ప్రకాష్ రాజ్ లు పర్సనల్ గా ఈ ఎన్నికలను వేడెక్కించారు. ఇక మా ఎన్నికల టైం లో ప్రకాష్ రాజ్ ని మోహన్ బాబు హాగ్ చేసుకోవడం అక్కడ కనిపించింది.