Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 5: అనూహ్యంగా ఎలిమినేషన్ లోకి


బిగ్ బాస్ సీజన్ 5 ఐదు వారలను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.. కొద్దో గొప్పో ఎంటర్టైనింగ్ గా ఉన్న బిగ్ బాస్ సీజన్ 5 ఈ వారం గొడవలు, రొమాన్స్ తో కాస్త ఇంట్రెస్ట్ కలిగించింది. లేదంటే బిగ్ బాస్ పై బుల్లితెర ప్రేక్షకులు కంప్లైంట్స్ పెడుతున్నారు.. ఇంట్రెస్టింగ్ లేదు బిగ్ బాస్ అంటూ. ఇక నాగార్జున శని, ఆది వారం బిగ్ బాస్ ఎపిసోడ్స్ ని ఆసక్తికరంగా మార్చడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ రోజు శనివారం ఎపిసోడ్ లో కొండ పొలం టీం.. క్రిష్, హీరో వైష్ణవ తేజ్ బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసారు. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో నాగ్ తప్పు చేసిన వారిని మందలిస్తూ కొంతమందిని ఎలిమినేషన్ నుండి సేవ్ చేసారు.

Advertisement
CJ Advs

అయితే ఈ రోజు ఉదయం వరకు హమీదా, విశ్వ నామినేషన్స్ లో డేంజర్ జోన్ లో ఉన్నారనే అన్నప్పటికీ.. అనూహ్యంగా ఇప్పుడు కాజల్ పేరు ప్రచారం లోకి వచ్చింది. ఎందుకంటే హౌస్ లో కాజల్ అన్ని అంటే ఇతర కంటెస్టెంట్స్ విషయంలో కలగజేసుకోవడం, నా గేమ్ ప్లాన్, నా స్ట్రాటజీ అంటూ గేమ్ ఆడడం, అలాగే కొంతమందిని ఇన్ఫ్లూయెన్స్ చేస్తుంది అనే కారణంతో.. చాలామంది కాజల్ ని వరెస్ట్ పెరఫార్మెర్ ని చెయ్యడమే కాదు.. బిగ్ బాస్ జైలుకి కూడా పంపించారు. అయితే ఆదివారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేది కాజల్ అంటున్నారు. ఆర్ జె కాజల్ ఆదివారం ఎలిమినేట్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి రేపు ఈపాటికి ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలిసిపోతుందిలే. 

RJ kajal Eliminated from Bigg Boss Telugu 5:

RJ kajal Eliminated:&nbsp;<span>social media reports</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs