Advertisement
Google Ads BL

సమంత తల్లి కావాలనుకుంది.. ఇదే సాక్ష్యం


సమంత అక్కినేని అనే పేరు నుండి సమంత రౌత్ ప్రభు గా మారిపోయినట్లుగా.. గత శనివారమే సోషల్ మీడియాలో ప్రకటించింది. నాగ చైతన్యతో విడాకులు తీసుకుని సమంత ఒంటరిగా మిగిలిపోయింది. ఈ విడాకుల మేటర్ లో కేవలం సమంత దే తప్పు అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రోజెక్ట్ అయ్యింది. ఆమె తల్లి అవ్వాలనుకోలేదు. చాలాసార్లు అబార్షన్స్ కూడా అయ్యాయి. ఆమె ఎవరెవరితో ఎఫ్ఫైర్ కారణంగా చైతూని వదిలేసింది అనే ప్రచారం ఓ రేజ్ లో జరగగా.. తాజాగా సమంత వాటిని ఖండించింది. అవన్నీ నిజాలు కాదని చెప్పింది. 

Advertisement
CJ Advs

సమంత చెప్పింది అక్షరాలా నిజం. సమంత తల్లి అవ్వాలని అనుకుంది. దానికి సాక్ష్యం కూడా ఉంది. సమంత చైతు తో విడిపోయే ముందు గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం పాన్ ఇండియా మూవీ చేసింది. అయితే శాకుంతలం మూవీ కోసం సమంత ని సంప్రదించేందుకు నీలిమ గుణ సమంతని కలిసినప్పుడు ఆమె.. ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉన్నాను అని, శాకుంతలం షూటింగ్ త్వరగా ముగించేస్తే తాను ఆ సినిమా చేస్తాను అని, అసలు అప్పటికే సమంత సినిమాలు వదిలెయ్యాలనుకుంది. కానీ శాకుంతలం పీరియాడిక్ సినిమా, కథ నచ్చడంతో ఓకే చెప్పింది..

దానికి సమంత చాలా కండిషన్స్ పెట్టింది. శాకుంతలం షూటింగ్ ఫాస్ట్ గా ఫినిష్ చెయ్యాలి. ఇకపై ఇదే నా లాస్ట్ సినిమా. నేను షూటింగ్స్ నుండి చాలా రోజులు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను. అందుకే మీరు షూటింగ్ త్వరగా కంప్లీట్ చేస్తే నేను శాకుంతలం చేస్తాను అని చెప్పింది. మేము షూటింగ్ త్వరగా కంప్లీట్ చేస్తామని మాటిచ్చి.. జులై, ఆగష్టు కల్లా శాకుంతలం షూటింగ్ కంప్లీట్ చేసేసాం. సమంత పిల్ల కోసమే సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వనుకుంది అనే విషయాన్ని నీలిమ గుణ ఓ ఇంగ్లీష్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో  చెప్పారు. కానీ ఆగష్టు లోనే ఏదో జరిగి సమంత ఇలా విడాకుల వరకు వెళ్ళింది అని తెలుస్తుంది. 

Samantha wanted to wrap up Shaakuntalam fast as she planned to start family:

Samantha wanted to wrap up Shaakuntalam fast as she planned to start family: Neelima Guna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs