Advertisement
Google Ads BL

మహేష్ మెచ్చనిది - ప్రభాస్ కి నచ్చిందా


అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ వంగా సూపర్ స్టార్ మహేష్ బాబు చుట్టూనే తిరిగాడు. ఎందుకంటే మహేష్ తో సినిమా చెయ్యాలని. కానీ కుదరలేదు. ఆ తర్వాత అర్జున్ రెడ్డినే బాలీవుడ్ కబీర్ సింగ్ చేసి హిట్ కొట్టాడు. ఆ తర్వాత కూడా మహేష్ కి లైన్ చెప్పి ఓకె చేయించాలని చూసాడు. కానీ మహేష్ మాత్రం సందీప్ వంగా కథని మెచ్చలేదు. ఆ తర్వాత మళ్ళీ బాలీవుడ్ లో లో రణబీర్ కపూర్ తో యానిమల్ మూవీ మొదలు పెట్టాడు సందీప్ వంగా. ఆ తర్వాత ఆ సినిమా ఏమయ్యిందో తెలియదు కానీ.. ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ అంటూ పాన్ వరల్డ్ మూవీ చెయ్యబోతున్నాడు.

Advertisement
CJ Advs

మహేష్ కి కథ చెప్పి ఆయన్ని ఒప్పించలేక అదే కథతో ప్రభాస్ ని కలవగా.. ప్రభాస్ కి ఆ కథ నచ్చి సందీప్ వంగా తో సినిమా చేస్తున్నాడని ఇండస్ట్రీ టాక్.

మహేష్ బాబు కి నచ్చనిది ప్రభాస్ కి నచ్చిందా.. అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని కథ తో మెప్పించి అఫీషియల్ ప్రకటన ఇప్పించాడంటే సందీప్ వంగా మామూలోడు కాదుగా అంటున్నారు. మరి మహేష్ కథే.. ప్రభాస్ దగ్గరికి వెళ్ళింది అంటున్నారు. అనడం కాదు.. అదే నిజం అంటూ ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు కూడా.. మరి మహేష్ కి నచ్చనిది ప్రభాస్ కి దానిలో ఏం నచ్చిందో.. హ అలా అని నెటిజెన్స్ చెవులుకొరుక్కుంటున్నారు అంతే. 

Spirit is a story intended for Mahesh?:

Mahesh story in Prabhas movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs