బాలీవుడ్ బడా స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఎన్ సీబీ కష్టడీలో ఉన్నాడు. ముంబై క్రూయిజ్ షిప్ లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తో పాటుగా పట్టుబడి.. పోలీస్ కష్టడీలో ఉన్నా ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారుఖ్ ఖాన్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి ఆర్యన్ ఖాన్ కి కోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే ఈ రోజు మరోసారి కోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. నిన్న గురువారం ఆర్యన్ ఖాన్ కి 14 రోజులు జ్యుడిషియల్ కష్టడి విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
ఇక ఈ రోజు కూడా కోర్టులో వాదనల తర్వాత ఆర్యన్ ఖాన్ కి బెయిల్ దొరకలేదు. ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారుఖ్ లాయర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సెషన్స్ కోర్టు నుంచి బెయిల్ పొందే ప్రక్రియ చాలా ఎక్కువ ప్రాసెస్ కావడంతో బెయిల్ పొందడానికి 2 రోజుల నుండి 20 రోజుల వరకు పట్టవచ్చని అంటున్నారు. అదీ కాక రేపు కోర్టుకు సెలవులు కావడంతో ఈ వీకెండ్ అంతా జైల్లోనే గడపనున్నారు. ఈ రకంగా షారుఖ్ కి కొడుకు రూపంలో మరో షాక్ తగిలింది. ఆర్యన్ ఖాన్ తో పాటుగా ఇతర నిందితులని ఆర్థర్ జైలుకు తరలించారు. ఎన్సీబి అధికారులకి డ్రగ్స్ తో పాటుగా దొరికిపోవడంతో ఆర్యాన్ ఖాన్ బెయిల్ పై ఇంకా సందిగ్దత కొనసాగుతూనే ఉంది. రెండోసారి కోర్టు ఆర్యన్ ఖాన్ బెయిల్ ని నిరాకరించడంతో షారుఖాన్ ఫ్యామిలీ కన్నీటి పర్యంతమైంది. ఈ కేసులో ఇప్పటికే 16 మందిని ఎన్ సీబీఐ అరెస్ట్ చేసింది.