బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో ఇంకా ఎవరు గెలిచారో తేలలేదు కానీ.. ఈరోజు బిగ్ బిగ్ బాస్ హౌస్ లో వరెస్ట్ పెరఫార్మెర్ గా ఎవరు అవుతారో కానీ.. ఆ ప్రాసెస్ కంటెస్టెంట్స్ మధ్యన యుద్ధం మాములుగా జరగలేదు. ఈ హౌస్ లో ఈ వారం ఎవరు వరెస్ట్ పెరఫార్మర్ గా చెప్పడానికి వాళ్ళ మొహం మీద నీళ్లు కొట్టి చెప్పాలి. దానిలో రవి కాజల్ మొహం మీద నీళ్లు పొయ్యగా.. కాజల్ శ్రీరామ్ మీద పోసింది. ఇక షణ్ముఖ్, సిరి, జెస్సిలు కూడా శ్రీరామ్ నే టార్గెట్ చేసారు. ఇక శ్వేతా నేనూ ఆని మాస్టర్, సన్నీ ఫ్రెండ్స్ మమ్మల్ని విడగొట్టాలని అనుకుంటున్నారు అంది.
సన్నీ నిన్నటి నుండి ఆపుకుంటున్నాను అంటూ ఎమోషనల్ అయ్యాడు. సిరి విచ్చి విశ్వని దమ్ముంటే ముందు నుండి ఆడండి వెనకా నుంచి కాదు అనడం, షణ్ముఖ్ విశ్వ దగ్గరికి వచ్చి మమ్మల్ని చిల్లర గ్యాంగ్ అన్నావు.. నువ్వు ఫ్యామిలీనో ఫ్రెండ్స్ నో అలా అంటావా.. దానికి విశ్వ నేను నిన్ను అనలేదు.. అయినా నువ్వు కాయిన్స్ దొబ్బవా అనగానే షణ్ముఖ్ కామ్ అయ్యాడు. జెస్సి వచ్చి శ్రీరామ్ ని కుకింగ్ విషయంలో పోట్లాట పెట్టుకున్నాడు. ఇక శ్రీరామ్ - మానస్ మధ్యన గేమ్ స్ట్రాటజీ అనే గొడవ తో ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ హీటెక్కిలా కనిపిస్తుంది.