Advertisement
Google Ads BL

మొన్న ఎన్టీఆర్.. నేడు అల్లు అర్జున్


రెండు నెలల క్రితం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగారెడ్డి జిల్లా చేవేళ్లలోని శంకర్‌పల్లి తహసీల్దారు ఆఫీస్ లో సందడి చేసారు. అక్కడ శంకరపల్లి సమీపంలో ఎన్టీఆర్ కొంత భూమిని కొనుగోలు చెయ్యడంతో.. ఆ భూమి రిజిస్టేషన్ కోసం ఎన్టీఆర్ శంకర్‌పల్లి రిజిస్టర్ కార్యాలయంలోకి వచ్చారు. అప్పుడు ఎన్టీఆర్ తో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడ సిబ్బంది ఉత్సాహం చూపారు. ఇక తాజాగా అదే శంకర్‌పల్లి రిజిస్టర్ ఆఫీస్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా వెళ్లారు. అక్కడ శంకర్‌పల్లి మండలంలోని జన్వాడ గ్రామంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని అల్లు అర్జున్ ఈమధ్యనే కొనుగోలు చేశారు. 

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు ఆ భూమి రిజిస్టేషన్ కోసం అల్లు అర్జున్ చేవేళ్లలోని శంకర్‌పల్లి రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లారు. ఇక అల్లు అర్జున్ రిజిస్టేషన్ కోసం వెళ్లగా.. అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడని తెలియగానే ఆయన అభిమానులు అక్కడికి భారీగా చేరుకొని అల్లు అర్జున్ తో ఫొటోస్ దిగేందుకు ఉత్సాహం చూపించారు. ఇక అల్లు అర్జున్ శుక్రవారం ఆ భూమి రిజిస్టేషన్ అవ్వగానే అల్లు అర్జున్ అక్కడి నుండి వెళ్లిపోయారు. 

Allu Arjun Visits Shankarpally Registrar office:

Allu Arjun sudden Visit to Shankarpally
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs