Advertisement
Google Ads BL

సమంత చెప్పింది కరెక్ట్ కదా


భార్య భర్త విడిపోయారు అంటే.. అది భార్య వలనే అని మాట్లాడతారు. భర్త ఎలాంటి పని చేసినా.. భార్యనే వేలెత్తి చూపిస్తారు తప్ప మగవాడిని ఒక్క మాట కూడా అన్నారు. అది లోకం తీరు. ప్రస్తుతం నాగ చైతన్య తో విడిపోయిన సమంత కూడా అదే ఫీలవుతుంది. భర్త నాగ చైతన్య తో విడిపోతున్నట్లుగా ప్రకటించాక సమంత పై అనేకరకమైన ట్రోల్స్ మొదలయ్యాయి. ఆమె వేరే ఎవ్వరితోనో సంబంధం పెట్టుకుని నాగ చైతన్య కి విడాకులు ఇచ్చింది అని, తన స్టయిలిస్ట్ తో ప్రీతమ్ జుకాల్కర్ కోసమే చైతు ని వదులుకుంది అని, తల్లి కావడం ఇష్టం లేని సమంత భర్త ని వద్దనుకుంది అని, ఆమె బోల్డ్ పాత్రలకి భర్త అడ్డం పడుతున్న కారణంగానే సమంత నాగ చైతన్య కి విడాకులు ఇచ్చింది అంటూ రకరకాల ట్రోల్స్ తో సమంత ని ఇబ్బంది పెడుతున్నారు. 

Advertisement
CJ Advs

తాజాగా సమంత తన ఇన్స్టా పేజీ లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో మ‌హిళ‌లు ఏదైనా చేస్తే ఈ స‌మాజం ఎల్ల‌ప్పుడూ నైతిక‌తతో కూడిన ప్ర‌శ్న‌లు వేస్తుంటుంది. అదే ప‌ని మ‌గ‌వాళ్లు చేస్తే మాత్రం ప్ర‌శ్నించ‌దు. స‌మాజంలోని మ‌నుషులుగా మ‌న‌కు ప్రాథ‌మికంగా నైతిక‌త లేన‌ట్టే.. అంటూ స్టోరీ లో రాసుకొచ్చింది. మరి ఎవరూ చైతు ని ప్రశ్నించడం లేదు.. కేవలం సమంత నే టార్గెట్ చేస్తున్నారు.. అందుకే సమంత ఈ రకమయిన పోస్ట్ లు పెడుతుంది అంటూ కొంతమంది సమంతకి మద్దతు తెలుపుతున్నారు. ఇక సమంత నాగ చైతన్య తో విడిపోయాక.. గచ్చిబౌలి లోని ఓ ఫ్లాట్ లో ఉంటుంది అని సమాచారం. 

Samantha latest Insta story viral:

Samantha Instagram story after announcing her separation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs