Advertisement
Google Ads BL

లైగర్ రిలీజ్ అందుకే లేట్


విజయ్ దేవరకొండ- పూరి జగన్నాధ్ కాంబోలో పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న లైగర్ మూవీ ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది. కరణ్ జోహార్, ఛార్మి, పూరి కలిసి నిర్మిస్తున్న లైగర్ మూవీ రిలీజ్ డేట్ కోసం విజయ్ దేవరకొండ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. సెకండ్ వేవ్ లేకపోతె సెప్టెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన లైగర్ మూవీ కరోనా తో వాయిదా పడింది. అయితే లైగర్ మూవీ రిలీజ్ డేట్ పై అభిమానుల కంగారుకి విజయ్ సమాధానం చెబుతున్నాడు. మరి అభిమానుల్లో కంగారు ఎందుకు ఉండదు. బాలీవుడ్ మూవీస్ దగ్గర నుండి తెలుగులో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ డేట్స్ ఈమధ్యనే ప్రకటించేసారు.

Advertisement
CJ Advs

అయితే లైగర్ రిలీజ్ డేట్ పై విజయ్ ఏం చెప్పాడంటే.. ఇంకా లైగర్ రిలీజ్ డేట్ అయితే ఫైనల్ కాలేదు.. కారణం యూఎస్ షెడ్యూల్ అని చెబుతున్నాడు. రెండు వారాల పాటు జరగనున్న ఈ కీలక షెడ్యూల్ లో టైసన్ కూడా పాల్గొనబోతున్నారు. కాకపోతే ఈ యూఎస్ షెడ్యూల్ కు సంబంధించిన వీసా ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదని.. యూఎస్ షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా పూర్తయితే అప్పుడు లైగర్ రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వస్తుంది అని చెప్పాడు విజయ్ దేవరకొండ. అనన్య పాండే తో రొమాన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండ బాక్సర్ గా లైగర్ లుక్ లో అదరగొట్టేస్తున్నాడు. 

Vijay Devarakonda shares reason behind Liger delay:

Vijay Devarakonda on Liger Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs