Advertisement
Google Ads BL

జ్యుడీషియల్ కష్టడీకి షారుక్ కొడుకు


ముంబై క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీలో డ్రగ్స్ తో పాటుగా పట్టుబడిన బాలీవుడ్ బడా హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్.. ప్రస్తుతం ఎన్సీబీ కష్టడీలోనే ఉన్నాడు. షారుఖ్ కి సపోర్ట్ గా బాలీవుడ్ హీరో - హీరోయిన్స్ ఆయన ఇంటికి తరలివస్తున్నారు. షారుఖ్ కూడా బడా లాయర్లతో ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. కానీ ఎన్సీబీ మాత్రం ఆర్యన్ ఖాన్ ని కష్టడి కోరుతూ కోర్టులో పిటిషన్స్ వేస్తుంది. అంతేకాకుండా క్రూయిజ్ డ్రగ్స్ పార్టీలో ఎన్సీబీ ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో బడాబాబుల కొడుకులు, డ్రగ్స్ సప్లయిర్స్, ఇంకా పార్టీ నిర్వాహకులు ఉన్నారు. వారిని విచారణ జరిపే వరకు ఆర్యన్ ఖాన్ కి బెయిల్ ఇవ్వొద్దు అంటూ ఎన్సీబీ అధికారులు కోర్టుని కోరుతున్నారు.

Advertisement
CJ Advs

ఇక రెండు రోజుల పాటు ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్ ని కష్టడీలో ఉంచగా.. నేడు మరోసారి ఈ కేసు విచారణలో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కి 14 రోజుల పాటు జ్యూడిషియల్ కష్టడీకి ఇచ్చింది. బెయిల్ కోసం షారుఖ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఎన్‌సిబి అధికారులు సరిగ్గా విచారణ చేయడం కోసం సమయం కావాలని కోరింది. రిమాండ్ రిపోర్టులో అస్పష్టమైన కారణాలు, రిమాండ్ రిపోర్టు అసంపూర్తిగా ఉండడంతో కస్టడీ పొడిగించబడదని, చెబుతూ మొత్తం 8 మంది నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపుతున్నామని కోర్టు తెలిపింది. అయితే కోర్టు 14 రోజులు జ్యూడిషియల్ కష్టడి అనగానే కోర్టు లోనే ఆర్యన్ ఖాన్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణ జరగనుంది.

Aryan Khan sent to judicial custody for the next 14 days:

Mumbai court sends Aryan Khan to 14-day judicial custody
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs