గత శుక్రవారం రిలీజ్ అయిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ కి హిట్ టాక్ పడింది. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ గాను రిపబ్లిక్ సినిమా హిట్ అనే అన్నారు. సాయి తేజ్ నటన సూపర్బ్ అని, దేవా కట్ట దర్శకత్వం అదిరింది అని అన్నారు. సినిమాకైతే హిట్ టాక్ పడింది.. అందరూ హిట్ అన్నారు. కానీ సినిమాకి కలెక్షన్స్ మాత్రం రాలేదు. 12 కోట్ల బడ్జెట్ ని సాయి తేజ్ రిపబ్లిక్ వెనక్కి తీసుకురాలేకపోయింది. సాయి తేజ్ రిపబ్లిక్ కి ఫస్ట్ వీకెండ్ 5 కోట్లు రాగా.. సోమవారం నుండి ఆ కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. అంటే మిగతా ఏడు కోట్లు కొల్లగొట్టడం రిపబ్లిక్ కి కష్టం గా మారిందీ.
పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లే ఈ సినిమాని బాగా లైక్ చేసారు.. బిసి సెంటర్స్ ఆడియన్స్ కానీ, మల్టిప్లెక్స్ ఆడియన్స్ కానీ రిపబ్లిక్ ని పట్టించుకోలేదు. సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైహాస్పిటల్ లో ఉండగానే ఈ సినిమా రిలీజ్ అయినా.. సింపతీ ఎంతవరకు నడుస్తుంది.. మొదటి మూడు రోజులకే రిపబ్లిక్ పని ఫినిష్ అయ్యింది. సాయి తేజ్ కి రిపబ్లిక్ మూవీ హిట్ ఇచ్చినా.. కలెక్షన్స్ ఇవ్వలేకపోయింది. మరి హిట్ టాక్ తో నిల్ కలెక్షన్స్ తో ఈ సినిమా ప్లాప్ ల లిస్ట్ లోకి వెళ్ళిపోయింది.