Advertisement
Google Ads BL

పెళ్లి రోజున సమంత పోస్ట్


సమంత. అక్కినేని నుండి సమంత రౌత్ ప్రభు కింద మారిపోయింది. అక్కినేని ఫ్యామిలీ నుండి, నాగ చైతన్య నుండి సమంత దూరమైంది. ఐదు రోజుల క్రితమే వారు విడిపోతున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా తెలియజేయారు. ఈ రోజు సమంత - నాగ చైతన్య పెళ్లి రోజు. మరి వారు విడిపోకుండా కలిసే ఉంటే.. ఈపాటికి అక్కినేని ఫ్యామిలి సెలెబ్రేషన్స్ ఆకాశాన్ని తాకేవి. లేదంటే వెకేషన్స్ పేరు చెప్పి సమంత - చైతన్యలు ఎక్కడో విహరిస్తూ ఉండేవారు. అదేం జరగడం లేదు. విడిపోయి విడిగా ఉంటున్న సమంత తన పెళ్లి రోజున ఎమోషనల్ గా ఓ పోస్ట్ పెట్టింది. సమంత పోస్టుకి అర్ధం తెలియకపోయినా.. ఆమె ఎమోషన్ ఆ పోస్ట్ లో అర్ధమవుతుంది.

Advertisement
CJ Advs

పాత ప్రేమ పాటలు- పర్వతాలు, శిఖరంపై శీతాకాలపు గాలి ధ్వని. కొన్ని పొగొట్టుకున్న పాత చిత్రాల పాటలు దొరికినప్పుడు. లోలోపలి బాధను ప్రతి ధ్వనించే ఆ ప్రేమ పాటలు. పాత బంగ్లాలు, మెట్ల మార్గాలు. ఆ సందులలో గాలి శబ్దం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సమంత దానితో పాటుగా.. ఓ పిక్ ని పోస్ట్ చేసింది. వైట్ డ్రెస్ లో కిందకి చూస్తూ సమంత ఉన్న పిక్ అది. మరి పెళ్లి రోజున హ్యాపీ గా ట్వీట్ చెయ్యాల్సిన సామ్.. ఇలా ఎమోషనల్ గా చేసింది. అటు చూస్తే నాగ చైతన్య మాత్రం ఈ విడాకుల మేటర్ పై ఎలాంటి స్పందన లేకుండా ఉన్నాడు. 

Samantha Emotional post on her Wedding anniversary:

Samantha Uploaded Story On The Day Of Her Marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs