బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతుంది అంటే.. ఎవరు రొమాన్స్ చేస్తారు.. ఏ జంట ప్రేమ పక్షులుగా ఎక్సపోజ్ అవుతుంది అని చూస్తున్న బిగ్ బాస్ ప్రేక్షకులు గతంలో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి, మోనాల్, అఖిల్ లవ్ ట్రాక్స్ బిగ్ బాస్ కి బాగా పని చేసాయి. అందుకే ఐదో సీజన్ లోను ఇలాంటి లవ్ ట్రాక్ సెట్ చేద్దామని బిగ్ బాస్ యాజమాన్యం, నాగార్జున కూడా ట్రై చేస్తున్నారు. హమీద - శ్రీరామ్ మధ్యన లవ్ ట్రాక్ ఉన్నట్టే ఉన్నా.. అది అంతగా బయటపడడం లేదు. శ్రీరామ్ తో హమీద క్లోజ్ గానే ఉంటుంది. శ్రీరామ్ కూడా బుద్దివంతుడిలా కనిపిస్తున్నాడు. హమీద గ్లామర్ గా ఆకట్టుకుంటుంది.
ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ లో రొమాన్స్ మొదలైపోయింది. హమీద - శ్రీరామ్ లు లైట్స్ ఆగిపోయాక హగ్స్, బెడ్ పై ఫ్లయింగ్ కిస్ అంటూ రొమాన్స్ ని దట్టించేస్తున్నారు. కెప్టెన్సీ టాస్క్ లో శ్రీరామ్ సంచాలక్ గా ఉంటే.. హమీద సారీ తో ఎక్సపోజ్ చేస్తుంది. ఇక గత రాత్రి లైట్స్ ఆగిపోయాక హమీద - శ్రీరామ మాట్లాడుకుని ఎవరి బెడ్ పైకి వాళ్ళు వెళ్ళాక ఫ్లయింగ్ కిస్ లు పెట్టుకోవడం చూస్తే మిడ్స్ నైట్ రొమాన్స్ స్టార్ట్ అయినట్లే అనిపిస్తుంది. ఇక ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఐదో కెప్టెన్ ఎవరనేది తేలిపోతుంది.