ఆచార్య మూవీ డేట్ డిసెంబర్ 17 అని మెగా ఫాన్స్ ఫిక్స్ అయ్యారు. ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ తో మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. చిరు - కొరటాల శివ కాంబో ఆచార్య మూవీ పక్కాగా డిసెంబర్ 17 న అల్లు అర్జున్ పుష్ప మీద ఫైట్ కి రెడీ అయ్యింది. ఆచార్య రిలీజ్ డేట్ సూన్ అంటూ పోస్టర్స్ తో హంగామా చేస్తున్నారు. గత వారం రోజులుగా ఆచార్య డేట్ పై ఇదే రకమయిన హడావిడి కనిపిస్తున్నా.. ఆచార్య మేకర్స్ మాత్రం కదలడం లేదు. అసలు ఆచార్య డేట్ ఎప్పుడు ఇస్తారో కానీ.. ఫాన్స్ మాత్రం చిరు ఆచార్యని డిసెంబర్ 17 నే పక్కాగా రిలీజ్ చెయ్యబోతున్నారంటూ ఫిక్స్ అవుతున్నారు.,
మరి నిజంగానే ఆచార్య సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో కానీ.. ఆచార్య కి కరెక్ట్ డేట్ దొరకడం లేదు అని వినికిడి.. ఏదో ఒక సినిమా మీద కి పోటీ కి వెళ్లడం తప్ప వేరే దారి లేదు. డిసెంబర్, జనవరి సంక్రాతి తప్ప లేదంటే మళ్ళీ వచ్చే ఏడాది ఏప్రిల్ కే ఆచార్య డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆచార్య మేకర్స్ నిద్రలేచి ఆ డేట్ ఇచ్చేస్తే సరి.. లేదంటే మిగతా మేకర్స్ కూడా కన్ఫ్యూజ్ అవ్వడం ఖాయం.