ఈమధ్యన బరువు తగ్గి కాస్త అందాన్ని కోల్పోయిన కీర్తి సురేష్.. మరీ లావుగా తయారవ్వకపోయినా.. గ్లామర్ తో బాగానే కళకళలాడుతుంది. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ తో రొమాన్స్ చేస్తున్న కీర్తి సురేష్.. పలు బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గాను అదరగొట్టేస్తుంది. సోషల్ మీడియాలో కొన్నాళ్లుగా యాక్టీవ్ గా మారిన కీర్తి సురేష్ తాజాగా రెడ్ సారీ కట్టుకుని బొట్టు పెట్టుకుని ఉన్న ట్రెడిషల్ లుక్ ఫొటోస్ ని షేర్ చేసింది. రెడ్ సారీ లో కీర్తి సురేష్ రకరకాల ఫోజులతో ఫోటో షూట్ చేయించుకుంది.. ప్రస్తుతం కీర్తి సురేష్ రెడ్ సారీ లుక్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.