Advertisement
Google Ads BL

ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు ఫైర్


సినిమా ఇండస్ట్రీలో మా ఎన్నికలు యుద్ధ వాతావరవణాన్ని తలపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ మంచు విష్ణు ని నరేష్ ని మీకు అంత సీన్ లేదు అంటే.. ప్రకాష్ రాజ్ ని మంచు విష్ణు వాళ్ళు మీకూ అంత సీన్ లేదంటున్నారు. ప్రకాష్ రాజ్ నరేష్ ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని హెచ్చరిస్తే.. మంచు విష్ణు ఒళ్ళు జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మా ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా జరగాలని ఒకరు, మరొకరు ఈవీఎం ల ద్వారా జరగాలని, ఒకరి మీద ఒకరు ప్రెస్ మీట్స్ పెట్టుకుని తిట్టుకుంటున్నారు. ఛానల్స్ లో లైవ్ లోనే పోటీ పడుతున్నారు. మంచు విష్ణు ఫ్యామిలీని ప్రకాష్ రాజ్ ప్యానల్ వాళ్ళు నోటికొచ్చినట్లుగా మట్లాడారు.

Advertisement
CJ Advs

దానితో విష్ణు ప్రెస్ మీట్ పెట్టి నా భర్య నాకు ఓటెయ్యమని అడగడంలో తప్పు లేదు. అయినా నా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటూ ఫైర్ అయ్యాడు. రేపు 10 న ఎలక్షన్స్ అయ్యాక 11 నుండి అందరం మోహ మొహాలు చూసుకోవాలి. ప్రకాష్ రాజ్ ఎవరండీ మా ఎన్నికలు అవ్వగానే ఆయన ఇంటికి వెళ్ళిపోతారు. రేపు మనం మనము ఒకటి అంటూ మంచు విష్ణు కాస్త గట్టిగానే వార్నింగ్ లాంటిది ఇచ్చాడు. శ్రీకాంత్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దు. జీవిత గారు ఈ వ్యవహారంలోకి మా నాన్న గారిని లాగొద్దు అంటూ మంచు విష్ణు రెచ్చిపోయాడు. మరోపక్క ప్రకాష్ రాజ్ ఆ నలుగురు పెద్దల సపోర్ట్ నాకొద్దు.. విష్ణు పిల్ల కాకి అన్నట్టుగా ఆయన రెచ్చిపోతున్నాడు. మరి ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు లలో మా అధ్యక్ష పీఠం పై ఎవరు కూర్చుంటారో కానీ.. ప్రస్తుతం ఈ ఎన్నికల హడావిడి మాత్రం పాలిటిక్స్ ని తలపిస్తుంది. 

Manchu Vishnu fires on Prakash Raj:

Manchu Vishnu vs Prakash Raj
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs