Advertisement
Google Ads BL

మా ఎన్నికల్లోకి ఎన్టీఆర్ ని కూడా లాగేసారు


ప్రస్తుతం టాలీవుడ్ లో మా ఎన్నికల వేడి.. మాటల యుద్దానికి దారి తీసింది. ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు మధ్యన హోరా హోరీగా ఉండబోతున్న మా ఎన్నికల్లో.. ప్రకాష్ రాజ్ - విష్ణు లు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. ఇండస్ట్రీ పెద్దలతో మంచు విష్ణు భేటీ, బ్లెస్సింగ్స్, ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్స్, మధ్యలో జీవిత రాజశేఖర్ ప్రెస్ మీట్ అన్ని అగ్గి రాజేస్తున్నారు. నిన్న జీవిత రాజశేఖర్ ప్రెస్ మీట్ పెట్టి.. నేను తప్పు చేశాను అని మా అధ్యక్షలు నరేష్, అలాగే బండ్ల గణేష్ మాట్లాడుతున్నారు. నేనేం తప్పు చెయ్యలేదు. నా మీద ఆరోపణలు నిరూపిస్తే అందరి కాళ్ళు పట్టుకుంటాను అంటూ సంచనలంగా మాట్లాడింది జీవిత. ఇక ఈ ఎన్నికల విషయంలో చిరు - బాలయ్యలు హైలెట్ అవుతున్నా.. మిగతా స్టార్ హీరోలంతా సైలెంట్ గా ఉన్నారు.

Advertisement
CJ Advs

తాజగా మా ఎన్నికల్లోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని లాగేసారు. జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. మొన్న ఎన్టీఆర్ గారు కలిశారు. అమ్మ మా ఎన్నికల మేటర్ ఏమిటి అని అడిగారు.. మా ఎన్నికల విషయం చాలా హీటెక్కుతోంది అని అడిగారు. అంతా బానే ఉంది సర్.. మీరు ఓటెయ్యడానికి వస్తున్నారా అని అడిగితే.. అమ్మో ఓటెయ్యడమా.. ఈ మేటర్ లోకి నన్ను లాగకండి అన్నారు. మరి ఇక్కడ ఆయన పేరు చెప్పొచ్చో లేదో.. అంటూ ఎన్టీఆర్ పేరు చెప్పేసింది ఆవిడ. మరి ఈ ఎన్నికల్లో యంగ్ హీరోలంతా సైలెంట్ గా ఉంటున్న సమయంలో ఇలా జీవిత ఎన్టీఆర్ పేరుని మా ఎన్నికల్లో లాగెయ్యడంతో అయన అభిమానులు ఫీలవుతున్నారు. 

Jeevitha Rajasekhar Shares Jr NTR Reaction On MAA Elections:

Jeevitha Rajasekhar Shares NTR Reaction On MAA
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs