లఖింపూర్ ఖేరి లో రైతులపై కేంద్ర మంత్రి కొడుకు వాహనం దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు అక్కడిక్కడే దుర్మరణం చెందిన ఘటనపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నిరసనలు తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ లోని కారు దూసుకువెళ్లడంలో నలుగురు రైతులు అక్కడికక్కడే మృతి చెందడంతో.. కోపోద్రిక్తులైన రైతులు.. ఆ కారు డ్రైవర్ ని కొట్టి చంపడమే కాదు.. అఘర్షణలో మరో ముగ్గురు బిజెపి కార్యకర్తలు మృతి చెందారు. అక్కడ కార్లకి రైతులు నిప్పు పెట్టారు. అంతేకాకుండా ఈఘటనలో గాయపడిన ఓ జర్నలిస్ట్ కూడా మృతి చెండంతో ఈ ఘటన ఎంత తీవ్రంగా మారిందో చెప్పొచ్చు. ఇక నిన్న లఖింపూర్ ఖేరి కి రైతుల పరామర్శకు వచ్చిన ప్రియాంక గాంధీని అక్కడికి వెళ్లకుండా పోలీస్ లు ఆమెని ఓ గెస్ట్ హౌస్ కి తరలించారు.
ప్రస్తుతం లఖింపూర్ ఖేరి ఘటనపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే తాజాగా రైతులపైకి అజయ్ మిశ్రా కుమారుడి కార్ల కాన్వాయ్ దూసుకెళ్లి రైతులు మరణించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఎలాంటి జాలి, దయ లేకుండా.. అజయ్ మిశ్రా కుమారుడి కార్ల కాన్వాయ్ లోని ఓ కారు రైతుల మీదకి దూసుకెళ్లింది. ఆ క్రమంలో నిరసన చేస్తున్న రైతులు కారు కింద నలిగిపోయిన భీకర దృస్యాలు నిజంగా ఒళ్ళు గగుర్పొడిచేవిలా కనిపిస్తున్నాయి.