తన కొడుకు ఆర్యన్ ఖాన్ కి ఎలాగైనా బెయిల్ యిప్పించాలని షారుఖ్ ఖాన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ముంబై లోని క్రూయిజ్ షిప్ లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తో పాటు పట్టుబడిన ఎనిమిదిమందిని ఎన్ సీబీ అధికారులు విచారణ అంతంరం అరెస్ట్ చెయ్యడం, అందులో షారుఖ్.. కొడుకు ఆర్యన్ కూడా ఉన్నాడు. కొడుకు అరెస్ట్ పై షారుఖ్ తీవ్రంగా కలత చెందడంతో సల్మాన్ స్వయానా షారుఖ్ ఇంటికి వెళ్లి ఓదార్చారు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ బడా లాయర్లతో కొడుకు బెయిల్ పిటిషన్ పై చర్చించారు. కానీ ఎన్ సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ దొరికాయని.. ఇంకా ఏడుగురు మీద ఈ కేసు బుక్ అయ్యి ఉంది.. వారిని కూడా కోర్టులో ప్రవేశపెట్టేవరకు.. ఆర్యన్ ని కష్టడికి ఇవ్వమని కోర్టుని కోరింది.
దానితో ఆర్యన్ ఖాన్ ఎన్ సీబీ కష్టడిని అక్టోబర్ 7 వరకు పొడిగించింది కోర్టు. షారుఖ్ లాయర్లు ఎంతగా వాదించినా ఆర్యన్ ఖాన్ కి బెయిల్ దొరకలేదు. నా స్నేహితుడు మర్చంట్ వద్ద డ్రగ్స్ లభించాయి. కానీ మాదగ్గర లేవు. అయినా మమ్మల్ని అరెస్ట్ చేశారు అని ఆర్యన్ ఖాన్ చెప్పినట్టు చెబుతున్నారు. ఇక ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత మరికొంతమందిని అరెస్ట్ చేశామని, పార్టీలకు డ్రగ్స్ సప్లై చేసే వారిని అరెస్ట్ చేసాం అని, ఈ కేసులో మరికొంతమంది అరెస్ట్ చెయ్యాల్సి ఉంది అని, ఎన్ సిబి అధికారులు మీడియా కి తెలిపారు. అయితే ఆర్యన్ ఖాన్ కి గత నాలుగేళ్లుగా డ్రగ్స్ ఆలవాటు ఉంది అని, ఇలాంటి హై ప్రొఫైల్స్ పార్టీలకు ఆర్యన్ ఖాన్ తరచూ హాజరవుతుంటాడంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.