Advertisement
Google Ads BL

సింగిల్ గాను ఇరగదీసిన నమ్రత


నమ్రత - మహేష్ బాబు ఇప్పుడు సోషల్ మీడియాలో వీరే హాట్ టాపిక్. ఎందుకంటే మహేష్ - నమ్రత భార్య భర్తలు. తరచూ పిల్లలతో వెకేషన్స్ అని, ప్రత్యేకమైన రోజులకి ప్రత్యేకమైన పిక్స్ తో విష్ చేసుకునే ఈ జంట మళ్ళీ చాలా ఏళ్ళకి ఓ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చెయ్యడం.. ఇప్పుడు మ్యాగజైన్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అందరూ ఈ జంట గురించిన ముచ్చట్లే మాట్లాడుకుంటున్నారు. మహేష్ బాబు నమ్రతని వివాహమాడిన తర్వాత నమ్రత సినిమాలకు, షూటింగ్స్ కి బ్రేకిచ్చేసింది. భర్త, పిల్లలను చూసుకోవడం, అలాగే ఈ మధ్యన భర్త మహేష్ వ్యాపార లావాదేవీలు చక్కబెట్టడంతో నమ్రత బిజీగా మారారు. ఇక మహేష్ కూడా వీలుచిక్కినప్పుడల్లా భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో ఏ అమెరికానో, ఏ దుబాయో, ఏ గోవా నో నిన్నగాక మొన్న వెళ్ళిన స్పెయిన్ కో చెక్కేస్తుంటారు.

Advertisement
CJ Advs

ఇక హలో మ్యాగజైన్ కోసం చేసిన మహేష్ - నమ్రతల ఫోటో షూట్ లో వారిద్దరూ ఎంత బావున్నారో మాటల్లో వర్ణించడం కష్టం. అంత అందమైన జంట ఒకే ఫ్రేమ్ లో క్యూట్ గా స్వీట్ గా కనిపించేసరికి ఘట్టమనేని అభిమానులు ఆగడం లేదు. భర్త మహేష్ తో అందమైన ఫోజులిచ్చిన నమ్రత కూడా సింగిల్ షూట్ లో అదర గొట్టేసింది. మహేష్ పక్కన ఉంటే నమ్రతకి అందం వచ్చింది అని కాదు.. నమ్రత సింగిల్ గాను ఇరగదీస్తోంది అని.. హలో మ్యాగజిన్ మీద సింగిల్ గా ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

Mahesh - Namrata Hello Magazine Photoshoot:

Mahesh - Namrata feature on the cover of Hello
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs