సాయి ధరమ్ తేజ్ - దేవా కట్ట కాంబోలో తెరకెక్కిన రిపబ్లిక్ మూవీ గత శుక్రవారమే రిలీజ్ అయ్యింది. మిక్స్డ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతున్న రిపబ్లిక్ మూవీని పొలిటిషియన్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. లైక్ నారా లోకేష్ రిపబ్లిక్ మూవీ ని చూడాలనుకుంటున్నాని.. ఆ సినిమా బావుంది అని అందరూ చెబుతున్నారు అంటే.. కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, సీతక్కలు స్పెషల్ గా రిపబ్లిక్ ని వీక్షించి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. పవన్ అండ్ త్రివిక్రమ్ లు రిపబ్లిక్ లో సాయి తేజ్ నటన బావుంది అని.. మంచి సినిమా తీశారు అంటూ దేవా కట్టాని అభినందించారు. ఇక రిపబ్లిక్ మిక్స్డ్ టాక్ తో ఫస్ట్ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ రాబట్టింది అనే చెప్పాలి.
ఏరియా కలెక్షన్స్( కోట్లలో)
నైజాం - 1.39
సీడెడ్ - 0.87
ఉత్తరాంధ్ర - 0.61
ఈస్ట్ గోదావరి - 0.33
వెస్ట్ గోదావరి - 0.32
గుంటూరు - 0.37
కృష్ణా - 0.32
నెల్లూరు - 0.24
ఏపీ + తెలంగాణ- 4.45
ఇతర ప్రాంతాలు- 0.24
ఓవర్సీస్ 0.38
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - 5.07 కోట్లు షేర్