Advertisement
Google Ads BL

RAPO19 షూట్ కి బ్రేక్.. కారణం


రామ్ - తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి కాంబోలో మొదలైన RAPO19 బైలింగువల్ మూవీ షూటింగ్ నిన్నమొన్నటివరకు వేగంగా సాగింది. RAPO19 సెట్స్ మీదకెళ్ళిన కొద్ది రోజులకే.. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ RAPO19 సెట్స్ లో సందడి చేసిన ఫొటోస్.. అలాగే షూటింగ్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తుండేది టీం. ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది. సీనియర్ నటి నదియా ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కోసం రామ్ మేకోవర్ మాములుగా లేదు. కేరెక్టర్ లో లీనమయ్యేందుకు రామ్ సిక్స్ ప్యాక్ బాడీ కోసం జిమ్ లో చాలా కష్టపడి బాడీ ని బిల్డ్ చేసాడు.

Advertisement
CJ Advs

అయితే జోరుగా సాగుతున్న RAPO19 షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. కారణం రామ్ మెడకి దెబ్బతగలడం వలన. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో రామ్ మెడ కి దెబ్బతగలడంతో ప్రస్తుతం దర్శకుడు RAPO19 షూటింగ్ కి బ్రేక్ ఇచ్చేసారు. రామ్ మెడకి బ్యాండేజ్ ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. RAPO19 షూట్ కి చిన్న బ్రేక్.. కారణం రామ్ నేక్ కి గాయం అవడం వలన.. డబుల్ ఎనేర్జి తో మళ్ళీ షూటింగ్ కి త్వరలోనే రామ్ అంటూ రామ్ పీఆర్ టీం రామ్ కి దెబ్బతగిలి పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే రామ్ కి మెడకి గాయం అవడంతో ఆయన ఫాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. 

Ram RAPO19 shoot halted :

RAPO19 shoot halted due to his Neck injury during body transformation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs