Advertisement
Google Ads BL

తమన్నా అవుట్.. అనసూయ ఇన్


ఈ ఏడాది సీటిమార్, మ్యాస్ట్రో మూవీస్ తో హిట్ అందుకున్న తమన్నా అటు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసి రెండు వెబ్ సీరీస్ ల్లో నటించేసింది. కానీ డిజిటల్ ఎంట్రీ లో తమన్నా సక్సెస్ అవ్వలేదు. వెండితెర మీద ఇప్పటికి గ్లామర్ ఒలకబోసే తమన్నా కొత్తగా జెమినీ ఛానల్ లో ప్రసారం అవుతున్న మాస్టర్ చెఫ్ అనే ఈవెంట్ కి హోస్ట్ గా వస్తుంది. ఆగస్టు లో భారీగా మొదలైన మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం.. జెమినీ ఛానల్ లో శుక్ర, శని వారాల్లో రాత్రి 8.30 నిమిషాలకు ప్రసారమవుతుంది. ఈ వంటల ప్రోగ్రాం కి తమన్నా వ్యాఖ్యాతగా గ్లామర్ షో బాగానే చేస్తుంది. తమిళ్ లో ఇదే వంటల ప్రోగ్రాం కి విజయ్ సేతుపతి హోస్ట్.

Advertisement
CJ Advs

అయితే బెంగళూరులోని ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్‌లో ఈ షో షూట్ జరుగుతుంది కానీ.. ఈ షో కి అనుకున్న టీఆర్పీ రావడం లేదు. ఈ షో కి తమన్నా భారీగా రెమ్యునరేషన్ అందుకుంటుంది. అయితే తాజాగా ఈ మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం నుండి తమన్ అవుట్ అంటున్నారు. ఆమె ప్లేస్ లోకి జబర్దస్త్ యాంకర్ అనసూయ రాబోతుంది అంటూ న్యూస్ మొదలైంది.తమన్నాను ఈ షో నుండి తప్పించానికి కారణాలు తెలియనప్పటికీ.. ఆమె పాల్గొనాల్సిన డేట్స్ లో మాస్టర్ చెఫ్ చిత్రీకరణకు రాకపోవడంతో.. అంటే తదుపరి ఎపిసోడ్ షూటింగ్ కోసం ఆమె అందుబాటులో లేదని అందుకే ఆమె ప్లేస్ లో అనసూయను తీసుకుంటున్నట్టుగా టాక్. ఇక తమన్నాహోస్ట్ చేసినప్పుడు మాస్టర్ చెఫ్ కి అనుకున్నంత ఆదరణ అయితే లభించలేదనే చెప్పాలి. 

Tamanna out, Anasuya in:

Anasuya Bharadwaj to replace Tamannaah Bhatia as host Masterchef
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs