Advertisement
Google Ads BL

బోరింగ్ బిగ్ బాస్


బోర్ కి చెప్పండి గుడ్ బై అంటూ సెప్టెంబర్ 5 న స్టార్ మా లో నాగార్జున హోస్ట్ గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 నాలుగు వారాలు ముగించుకుని ఐదో వారంలోకి అడుగుపెట్టింది. కానీ ఇంతవరకు ఓ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కూడా బిగ్ బాస్ లో కనిపించలేదు. స్టార్ మా శ్రీరామ చంద్ర - హమీదాల మధ్య లవ్ ట్రాక్ వెయ్యడానికి శతవిధాలా పయత్నాలు చేస్తుంది. దానికి నాగ్ కూడా వంతపాడుతున్నాడు . మరోపక్క షణ్ముఖ్ బిగ్ బాస్ గేమ్ ఆడకపోయినా.. నాగార్జున షన్ను నే హైలెట్ చేస్తున్నాడు. ఇక వారం వారం కంటెస్టెంట్స్ ని క్లాస్ పీకే నాగ్ అంతగా ఎవ్వరిని తిట్టడం లేదు. మరోపక్క ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ శనివారమే లీకవుతుంది.

Advertisement
CJ Advs

బిగ్ బాస్ హౌస్ లో ఒక్క స్ట్రాంగ్ కంటెస్టెంట్ లేరు. ఒక్కరూ ఎంటర్టైన్ చేసే వారూ లేరు. లవ్ ట్రాక్ తో అయినా షో మీద ఇంట్రెస్ట్ పెంచుదామంటే.. అది రొమాంటిక్ గా ఉండడం లేదు. వారం వారం నాగ్ ఎపిసోడ్స్ అన్నా ఊరటనిస్తాయనుకుంటే.. అదీ లేదు. ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఆత్రుతని బిగ్ బాస్ లీకులు లేకుండా చేస్తున్నాయి. ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో ఆ కంటెస్టెంట్ బిగ్ బాస్ స్టేజ్ మీద ఏం చెబుతారో అనే ఉత్కంఠ లేకుండా పోయింది. కారణం లీకులే. దానితో బోరింగ్ బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్ ప్రేక్షకులు నానా గోల చేస్తున్నారు. మరి ఈ రోజు ఎలిమినేట్ అవ్వబోయే కంటెస్టెంట్ నటరాజ్ అన్న విషయం శనివారం రాత్రే రివీల్ అయ్యిపోయింది. అందుకే అనేది బోరింగ్ బిగ్ బాస్ అని.. 

Bigg Boss season 5 utterly boring :

Bigg Boss 5 misses entertaining elements and glamour 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs