Advertisement
Google Ads BL

రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన బాలీవుడ్ హీరో కొడుకు


టాలీవుడ్ నుండి శాండల్ వుడ్, బాలీవుడ్ వరకు కొంతమంది డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కుని ఊపిరాడడం లేదు. గత ఏడాది టాలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్ లోని సెలబ్రిటీస్ డ్రగ్స్ దందాలో ఎన్ సీబీ ఎదుట హాజరయ్యారు. కొంతమంది ఈ కేసులో శిక్ష కూడా అనుభవించారు. సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి ఈ డ్రగ్స్ కేసులో జైలుకి వెళ్ళింది. అలాగే రాగిణి ద్వివేదీ, నటి సంజనాలు డ్రగ్స్ కేసులో జైలు ఊచలు లెక్కబెట్టారు. టాలీవుడ్ లో పలువురు ఈ కేసులో విచారణ ఎదుర్కుంటున్నారు. ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం కీలకంగా ఉన్న సమయంలో బాలీవుడ్ లో బడా డ్రగ్స్ రాకెట్ బయట పడింది.

Advertisement
CJ Advs

ముంబై లోని నగర శివార్లలో ఓ రేవ్ పార్టీలో బాలీవుడ్ సెలబ్రిటీస్ కొడుకులు పట్టుపడడం కలకలం రేపింది. ముంబై వేదికగా ఈ డ్రగ్స్ రాకెట్ ని ఎన్ సీబీ పట్టుకుంది. 8 మందిని అరెస్ట్ చెయ్యగా.. ఇప్పుడు ఈ పార్టీలో సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటూ రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోవడంతో.. ఇప్పుడు ఈ కేసు ఆర్యన్ ఖాన్ మెడకి ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా టాక్. బాలీవుడ్ లో బడా ప్రముఖుల పిల్లలు ఈ డ్రగ్స్ తీసుకుంటూ పార్టీలో పాల్గొంటున్నారని.. ఈరోజు రాత్రి 11 గంటలు లోగ విచారణకు హాజరవ్వకపోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఎన్ సీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు. 

Rave party busted on ship near Mumbai:

Shah Rukh Khan Son Aryan Khan Being Questioned By NCB
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs