అక్కినేని నాగ చైతన్య - సమంత విడిపోయారనే న్యూస్ ఇంకా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. నాగార్జున కూడా వారు విడిపోవడం దురదృష్టకరమని.. ఇద్దరూ హ్యాపీ గా ఉండాలని, ఇద్దరూ తనకి కావాల్సిన వారే అంటూ ఎమోషనల్ అయ్యాడు. చైతు - సామ్ ది తొమ్మిదేళ్ల ప్రయాణం. ఐదేళ్లు ప్రేమలో ఉండి.. నాలుగేళ్లు పెళ్లి తో కలిసి జీవించారు. అయితే సమంత చైతు లైఫ్ లోకి రాకముందు హీరో సిద్దార్థ్ తో ప్రేమాయణం నడిపించింది. ఇద్దరూ కలిసి గుళ్ళకి వెళ్లడం, పూజలు చేయించడం అబ్బో.. పెళ్లి వరకు వెళ్ళిన ఇద్దరూ ఉన్నట్టుండి బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత చైతూ.. సమంతని కలవడం.. పెళ్లి చేసుకోవడం అందరికి తెలిసిందే.
కానీ ఇప్పుడు వాళ్ళు విడిపోవడానికి కారణం ఏమిటో కానీ.. సమంత - చైతూ విడిపోయామని ప్రకటించిన కొద్ది సేపటికే.. సమంత తన ఇన్స్టాలో తన తల్లి చెబుతుండేది.. నిజమైన ప్రేమంటే ఏమిటో అంటూ రాసుకొచ్చింది. ఆతర్వాత హీరో సిద్దార్థ్ స్కూల్ లో నేను నేర్చుకున్న మొదటి పాఠం ఏంటంటే.. మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు.. మరి మీ సంగతేంటి.. అంటూ ట్వీట్ చేసాడు. అంటే సమంత మోసగత్తె.. అందుకే నా నుండి విడిపోయింది, ఇప్పుడు నాగ చైతన్య మోసం చేసింది అనేగా దానర్దం అంటున్నారు నెటిజెన్స్. సమంత - చైతు విడిపోవడంతో వాళ్ళని టార్గెట్ చేస్తూ సిద్దు ఇలాంటి ట్వీట్ చేసాడు అని అంటున్నారు.