Advertisement
Google Ads BL

ఈ రోజు బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యేది


ఈ రోజు రాత్రి జరిగే ఎలిమినేషన్స్ విషయం గత రాత్రి జరిగిన స్టార్ మా ఎపిసోడ్ నుండి బయటికి లీకైపోయి.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం గత మూడు వారాలుగా చూస్తూనే ఉన్నాము. సరయు ఎలిమినేషన్, ఉమాదేవి.. చివరికి లహరి ఎలిమినేషన్ కూడా బయటికి వచ్చేసింది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న 8 మంది కంటెస్టెంట్స్ లో అందరి కన్నా తక్కువ ఓట్స్ వచ్చిన నటరాజ్ మాస్టర్ ని ఈ ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళిపోయాడు. అంటే బిగ్ బాస్ సీజన్ 5 నాలుగో వారంలో ఎలిమినేట్ అయిన నాలుగో కంటెస్టెంట్ గా నటరాజ్ మాస్టర్ నిలిచారు. గత రాత్రి ఎపిసోడ్ లో అందరికి క్లాస్ పీకుతూనే ఫన్నీ గా బరువు తగ్గిన వారికీ చిన్న చిన్న గిఫ్ట్ లు ఇచ్చాడు నాగ్. 

Advertisement
CJ Advs

అయితే ఈ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన నటరాజ్ మాస్టర్.. హౌస్ లో కాస్త ఆగ్రహంగా ఉండడం, అందరిని గుంట నక్క, నత్త నడక అంటూ.. ఎవరినో అంటుంటాడు తప్ప ఓపెన్ అవ్వడు. రవి కి నటరాజ్ కి మధ్యన కోల్డ్ వార్ నడుస్తుంది. ఊసరవెల్లి కూడా ఉందని పిల్లి, నెమలి, ఎలుగుబంటి జంతువులతో హౌస్ మేట్స్ ని పోలుస్తూ.. అందరిని ఇరిటేట్ చేసాడు.. కాబట్టి ఆయన హౌస్ నుండి వెళ్లడమే కరెక్ట్ అంటున్నారు నెటిజెన్స్. కాకపోతే.. ఎపిసోడ్ రాకముందే ఇలా ఎలిమినేట్ అయిన పేరు లీక్ అవడమే బిగ్ బాస్ కి తలనొప్పి వ్యవహారం. 

Bigg Boss 5: Nataraj Master Evicted this week :

Bigg Boss 5: Nataraj Master eliminated this week 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs