Advertisement
Google Ads BL

గాడ్ ఫాదర్ కి పూరి కి కనెక్షన్ ఏమిటో..


చిరంజీవి ఆచార్య షూటింగ్ ని పూర్తి చేసేసి.. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫెర్ రీమేక్ గాడ్ ఫాదర్ మూవీలో నటిస్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ లోనే జరిగిన గాడ్ ఫాదర్ షూటింగ్ ఈ మధ్యనే ఊటీ కి షిఫ్ట్ అయ్యింది. అయితే చిరంజీవి తాజాగా ఊటీ నుండి హైదరాబాద్ చేరుకొని ఆ తర్వాత రాజమండ్రి వెళ్లి అల్లూరి రామలింగయ్య స్టాట్యూ ని ఆవిష్కరించారు. ఇక చిరంజీవి - మోహన్ రాజా కాంబోలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ కి మరో డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి లింక్ ఉంది అంటున్నారు. అదేమిటంటే.. పూరి గాడ్ ఫాదర్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఛార్మి తో కలిసి తరచూ చిరంజీవి ని కలవడంతో.. ఏదైనా స్క్రిప్ట్ చెప్పడానికి తిరుగుతున్నాడేమో అనుకున్నారు. 

Advertisement
CJ Advs

కానీ పూరి జగన్నాధ్ లూసిఫర్ రీమేక్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చెప్పారని.. లూసిఫర్ సినిమా అంటే చాలా ఇష్టం అట. అయితే ఆ సినిమా తెలుగు స్క్రిప్ట్ కి సంబందించిన తనకి నచ్చిన మార్పులు చేర్పులు చెప్పడంతో.. చిరు కూడా పూరి జగన్నాధ్ మేకింగ్ స్టయిల్ నచ్చి పూరి చెప్పిన మార్పులను కూడా తీసుకుని లూసిఫర్ మూవీ రీమేక్ చేస్తున్నారు. పూరి చెప్పిన సీన్స్ ని కూడా చిరు లూసిఫర్ రీమేక్ స్క్రిప్ట్ కి యాడ్ చేసి మరీ చిత్రీకరణ చేస్తున్నారట. పూరి చెప్పిన వాటిలో హీరోయిజం హైలెట్ సీన్స్ ఉన్నట్లుగా టాక్. 

Puri Jagannath inputs for Chiru Godfather:

Chiru God father update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs