Advertisement
Google Ads BL

అక్కినేని అభిమానుల హర్ట్ బ్రేక్ అయ్యింది


అక్కినేని ఫ్యామిలీ లో పెద్ద కుదుపు ఏర్పడింది. నాగార్జున ఫ్యామిలీకే కాదు.. అక్కినేని అభిమానులకి బిగ్ షాక్. ఎప్పటి నుండి నాగ చైతన్య - సమంత విడిపోతున్నారంటూ న్యూస్ వచ్చినప్పటినుండి అక్కినేని అభిమానులు షేక్ అవుతున్నారు. సమంత సోషల్ మీడియాలో అక్కినేని తొలగించడం, ఈమధ్యన చైతు - సామ్ లు ఒకే ఫ్రేమ్ లో కనిపించకపోవడం చూసిన వారు ఈ విడాకులు కంఫర్మ్ అనుకుంటే.. మధ్యలో సమంత నాగార్జునని మామ అంటూ బర్త్ డే విషెస్ చెప్పడం, అలాగే నాగేశ్వరరావు జయంతికి నాగ్ చేసిన వీడియో చూసిన సామ్ నాగ్ మామ సూపర్ అంటూ ట్వీట్ చెయ్యడంతో.. వాళ్ళ కు విడాకులు ఏమిటి అనుకున్నారు.

Advertisement
CJ Advs

అయితే ఈ రోజు ఉదయం నుండే నాగ చైతన్య - సమంత విడాకుల మేటర్ పై సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ . ఇక బిగ్ న్యూస్ వాళ్ళ విడాకుల మేటర్ పై అంటూ ప్రచారం జరుగుతూన్న టైం లో.. నాగ చైతన్య, సమంతలు సోషల్ మీడియా వేదికగా తమ మజిలీని ఆపేస్తున్నామని, పదేళ్ల బంధానికి స్వస్తి చెబుతున్నామని, ఎవరి కెరీర్ లో వారు ముందుకు సాగుతాము అంటూ.. సమంత ఓ నోట్ సోషల్ మీడియా లో షేర్ చెయ్యడంతో అక్కినేని ఫాన్స్ హర్ట్ బ్రేక్ అయ్యింది. అదేమిటి అక్కినేని ఫ్యామిలీ లో ఓ మెంబెర్ గా బాగా కలిసిపోయిన సమంత ఇలా చైతూ తో విడిపోవడం ఏమిటి అంటున్నారు వారు. ఈ విషయంలో అక్కినేని ఫాన్స్ బాగా ఫీల్ అవుతున్నారు. 

Samantha confirms the shocking news:

Naga Chaitanya-Samantha part ways
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs