రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ మూవీ సాంగ్స్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఖిలాడీ షూట్ పూర్తయినా ఖిలాడీ సాంగ్స్ చిత్రీకరణ బాలెన్స్ ఉండిపోయింది. ఇక ఆ తర్వాత రామ రావు ఆన్ డ్యూటీ షూటింగ్ లో పాల్గొంటున్న రవితేజ ఇప్పుడు మరో చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నాడు. క్రాక్ బ్లాక్ బస్టర్ తర్వాత వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిన మాస్ రాజా రవితేజ త్రినాధ్ రావు నక్కిన తో మరో ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టాడు RT69 అంటూ షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు.
రోల్ - కెమెరా - యాక్షన్.. #RT69 షూటింగ్ అక్టోబర్ 4 నుండి ప్రారంభం అంటూ మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా కుటుంబ కథా చిత్రాల స్పెలిస్ట్ త్రినాధ్ రావు - రవి తేజ కాంబో పై అందరిలో ఆసక్తి అంచనాలు ఉన్నాయి. TG విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత గా వ్యవహరించనున్నారు.