Advertisement
Google Ads BL

ప్రకాష్ రాజ్ అలా.. మంచు విష్ణు ఇలా


పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తారో.. లేదంటే ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తారో ప్రకాష్ రాజ్ చెప్పాలంటూ మంచు విష్ణు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే మా ఎన్నికల నేపథ్యంలో మంచు విష్ణు ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ తో కలిసి ప్రెస్ మీట్ పెట్టగా.. నరేష్ ప్రకాష్ రాజ్ ప్రాంతీయ వాదం లేవనెత్తారు. అయితే తాజాగా మంచు విష్ణు, నరేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్ వైపో? ఇండస్ట్రీ వైపా అని అడుగుతున్నారు. పవాన్ కళ్యాణ్ ఇండస్ట్రీ వ్యక్తి కాదా? మొదట ఆయన సినిమా హీరో.. ఆ తర్వాతే పొలిటిషియల్ అయ్యాడు. విష్ణు నువ్వు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో.. పవన్ కళ్యాణ్ సినిమాల మార్నింగ్ షో కి వచ్చే కలెక్షన్స్ అంత ఉండదు నీ సినిమా బడ్జెట్.. మీకు పొలిటికల్ అజెండా ఉంటే మీరు చూసుకోండి.. ఏపీ రాజకీయాలు నాకు తెలియవు. నాకు పవన్ కి సిద్ధాంతాల పరంగా భేదాలున్నాయి. కానీ ఆయన సినిమాల్లో బద్రి అయితే నేను నందానే.. మా ఎన్నికల కోసం ఏపీ సీఎం జగన్ ని, టీఎస్ సీఎం కేసీఆర్ ని ఎందుకు లాగుతున్నారంటూ విష్ణు కి స్ట్రాంగ్ పంచ్ వేశారు ప్రకాష్ రాజ్.

Advertisement
CJ Advs

ఇక మంచు విష్ణు మా ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ స్టార్ కృష్ణ ఇంటికి వెళ్లారు. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు కలిసి సూపర్ స్టార్ కృష్ణ మద్దతు కోసం వెళ్లారు. మా ఎన్నికల్లో విష్ణు ప్యానల్ అజెండాని వివరించి.. కృష్ణగారి మద్దతు కోరారు. 

Prakash Raj is like that, Manchu Vishnu is like this:

Prakash Raj Fires on Manchu Vishnu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs