ప్రముఖ హాస్యనటుడు, మెగాస్టార్ మామగారు అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలు సందర్భంగా శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ రాజమహేంద్రవరంలోని అల్లు రామలింగయ్య హోమియో పతి కళాశాల, వైద్య శాల వ్యవస్థాపకులు అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ నటుడిగా నేను జన్మించింది రాజమండ్రిలోనేనని అన్నారు. నా మొదటి మూడు సినిమాలు పునాది రాళ్ళు, ప్రాణం ఖరీదు, మన ఊరి పాండవులు ఈ ప్రాంతంలో చిత్రీకరణ జరిగాయన్నారు. నాది అల్లు రామలింగయ్యది గురు - - శిష్యుల సంబంధం అని.. బిజీగా ఘాటింగ్ లో ఉండడం వలన సమయానికి భోజనం చేయకపోవడం వల్ల కడుపులో మంట వచ్చేదని, ఎన్ని యాంటాసిడ్లు వాడినా కడుపులో మంట తగ్గలేదని అన్నారు.
యితే అప్పుడు అల్లు రామలింగయ్య ఒకసారి ఇచ్చిన హెూమియో మందుతో నొప్పి తీసినట్లు పోయిందని గుర్తుచేసుకున్నారు. ఈ రోజుకి మా ఫ్యామిలీ మొత్తం హెూమియోపతి మందులే వాడతామని, హెూమియోపతిలో తగ్గని జబ్బు లేదన్నారు. తనకి తనమామగారు అల్లు రామలింగయ్యకి ఎలా పరిచయం ఏర్పడిందో ఈ సందర్భంగా ఆయన అభిమానులల్తో పంచుకున్నారు. మనఊరి పాండవులు చిత్రం ఘాటింగ్ సందర్భంగా తిరిగి రైల్లో వెళ్తున్న సమయంలోనే నాకు అల్లు రామలింగయ్యతో పరిచయం ఏర్పడిందని అన్నారు. అప్పుడే నన్ను వలలో (అల్లుడుగా ) వేసుకున్నారనిపిస్తుందని అన్నారు. వానాకాల చదువులు చదివిన రామలింగయ్య గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, అల్లు అరవింద్, ఆయన బావ డాక్టర్ వెంకట్రావు, కళాశాల ప్రిన్సిపాల్ టి.సూర్యభగవాన్ తదితరులు పాల్గొన్నారు.