Advertisement
Google Ads BL

అల్లు బ్రదర్స్ ముగ్గురూ..


కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తనదైన కామెడీతో కడుపులు చెక్కలు చేసారు అల్లు రామలింగయ్య గారు. దశాబ్ధాల పాటు 1000 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని ఖ్యాతిని గడించారు. అక్టోబర్ 1న ఈయన జయంతి సందర్భంగా అభిమానులు ఆయన్ని గుర్తు చేసుకున్నారు. 

Advertisement
CJ Advs

కుటుంబ సభ్యులు శ్రీ అల్లు రామలింగయ్య గారికి నివాళులు అర్పించారు. ఆయన తెలుగు సినిమాకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అలాగే అల్లు రామలింగయ్య గారితో తమకున్న అనుబంధాన్ని మరోసారి నెమరేసుకున్నారు. 99 వసంతాలు పూర్తి చేసుకుని ఆయన శత జయంతిలోకి అడుగు పెడుతున్నారు. ఆయన 100వ జయంతి వేడుకలను రెండు స్థానాల్లో ఘనంగా జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు కుటుంబ సభ్యులు. తాతగారు విగ్రహావిష్కరణలో అల్లు బ్రదర్స్ పాల్గొన్నారు. ఆ తర్వాత అల్లు రామలింగయ్యగారి విగ్రహం వద్ద అల్లు బ్రదర్స్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Allu brothers unveils Allu Ramalingaiah statue:

Allu Bobby, Allu Arjun, Allu Sirish unveils Allu Ramalingaiah statue
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs