పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యల ఫలితం.. టాలీవుడ్ నిర్మాతలు హడావిడీగా.. ఏపీ మినిస్టర్ నాని తో మీట్ అయ్యి.. పవన్ వ్యాఖ్యలకు ఇండస్ట్రీకి సంబంధం లేదని చెప్పడం, పేర్ని నాని ఏకంగా చిరంజీవి గారే పవన్ చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నారని చెప్పడంతో.. ఇండస్ట్రీ మొత్తం ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒక్కరే ఒక వైపు అయ్యింది అనుకున్నారు. కానీ ఇక్కడ టాలీవుడ్ నిర్మాతలు మరో ట్విస్ట్ ఇచ్చారు. మొన్న బుధవారం ఏపీ మినిస్టర్ తో భేటీ అయిన నిర్మాతలు ఒక్క రోజు గ్యాప్ తో పవన్ కళ్యాణ్ ని కలవడం హాట్ టాపిక్ అయ్యింది.
టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు ఉదయం ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసు లు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్రపరిశ్రమకు సంభందించిన సమస్యల గురించి సృహృద్భావ వాతావరణంలో వీరి మధ్య చర్చలు జరిగాయి.. అంటూ పవన్ పిఆర్ టీం అప్ డేట్ ఇచ్చింది. మరి ఇండస్ట్రీ నుండి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబట్టిన నిర్మతలు మళ్లీ ఇలా పవన్ ని కలిసి ఇండస్ట్రీ సమస్యలపై మొరపెట్టు కోవడం ఏమిటో అంటూ పవన్ ఫాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.