Advertisement
Google Ads BL

ఏపీ ప్రభుత్వానికి అల్లు అరవింద్ రిక్వెస్ట్


అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు.  అక్టోబర్ 15న  ఈ సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్ర  నిర్మాత లు  ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ .. గీతా ఆర్ట్స్ లోగాని,జి.ఏ 2 లో గాని సినిమాలు హిట్స్ అయ్యాయి అంటే అవి మా వల్ల కాదు అవి మీ వల్లే..అందుకే ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ఇండియాకు మన తెలుగు ప్రేక్షకులు  ఒక లెషన్ నేర్పించారు. సినిమా రిలీజ్ చేస్తే ప్రేక్షకులు వస్తారనే నమ్మకాన్ని హిందీ వారికి మన తెలుగు వారు కలిగించారు..కరోనా వలన సినిమా విడుదల చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకే ఈ ప్రభుత్వాన్ని విన్నవించు కుంటున్నాము ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ ని తెలుసుకొని వాటిని సాల్వ్ చేయవలసిందిగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని కోరుతున్నాము. అలాగే హీరో హీరోయిన్లు ఇందులో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు .మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది అని అన్నారు.

బన్నీ వాసు, వాసు వర్మ లు మాట్లాడుతూ.. ఈ కథ  మాకు నచ్చడంతో సినిమా షూట్ కి వెళ్ళడం జరిగింది.  ఒక  రిలేషన్షిప్ నుంచి డిఫరెంట్ యాంగిల్స్ ని దర్శకుడు చూపించాడు .మేము చాలా కథలు వింటూ ఉంటాం కానీ కొన్ని కథలు లైఫ్  మీద ఇంపాక్ట్ చూపిస్తుంటాయి అలాంటిదే ఈ కథ. నా బిఫోర్ మ్యారేజ్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ 100 శాతం చేంజ్   అయ్యిందని చెప్పలేను కానీ ఈ సినిమాలో ఉండే ఆరు క్వశ్చన్ లు నా లైఫ్ లో అక్కడక్కడ తగులుతూ ఉన్నాయి . ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి వ్యక్తి తన భార్య  చేయి పట్టుకుని వెళ్తాడని ఖచ్చితంగా చెప్పగలను.అందుకే మాకు ఈ సినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చింది. నటీనటులందరూ చాలా చక్కగా నటించారు. ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.

చిత్ర దర్శకుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ మాట్లాడుతూ. .నేను ఎక్కువగా లవ్ స్టోరీస్ రాయను .లైఫ్ గురించి ఎక్కువగా రాస్తాను.లైఫ్ స్టొరీ లో లవ్ స్టొరీ వస్తుంది.  మనిషి లైఫ్ ను ఎలా లీడ్ చెయ్యాలి అనే కొశ్చన్ కు ఒక దారి దొరికితే దాన్ని ఫాలో అయ్యాను.ఇదంతా రాయడం నాకు చాలా స్త్రగుల్ అనిపించింది.. అయినా  వాసు వర్మ  నాకు సపోర్ట్ గా నిలిచాడు. ఫ్రెస్ కంటెంట్ తో వస్తున్న చిత్రమిది. అఖిల్ ను ఈ సినిమాలో ఫ్రెస్ గా చూస్తారు. అఖిల్,పూజ కెమిస్ట్రీ చాలా బాగుంది. అలాగే బన్నీ వాసు, అరవింద్ గార్ల సపోర్ట్ తో ఇక్కడిదాక వచ్చింది . అందరికీ  ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

చిత్ర హీరో అఖిల్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఐ ఓపెనర్ గా ఉంటుంది ఈ సినిమా ను ఫ్యామిలీతో వచ్చి చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ మాకు ఇలాంటి ఇన్సిడెంట్  జరిగిందని గుర్తు చేసుకుంటారు.  సినిమా లో చాలా బాగుంటుంది . దర్శకుడు భాస్కర్ చాలా చక్కగా తీశాడు.నిర్మాతలు ఒక బ్రిడ్జి లా ఉండి మాకు సపోర్ట్ గా నిలిచారు ఈ సినిమా చాలా బాగా వచ్చింది అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అన్నారు

Allu Aravind request on AP Government:

Allu Aravind at Most Eligible Bachelor Pre release event 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs