చిరంజీవి - కొరటాల శివ కాంబోలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ ఫినిష్ అయినా.. ఇంకా ప్యాచ్ వర్క్ సాంగ్స్ షూట్ బ్యాలన్స్ ఉండిపోయింది. ప్రస్తుతం కొరటాల ఆ సాంగ్స్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులని ఫినిష్ చేసుకుని రిలీజ్ డేట్ ఇద్దామని చూస్తున్నాయి. దసరా బరిలో ఆచార్య నిలుస్తుంది అనుకుంటే.. అది తప్పించేసారు. ఇక వచ్చె నెల నవంబర్ లో దివాళి స్పెషల్ గా అయినా ఆచార్య మూవీ ని రిలీజ్ చేస్తారేమో అనుకుంటే.. కాదు జనవరి సంక్రాంతి స్పెషల్ అన్నారు. కానీ తాజాగా ఆచార్య ని చిరు అండ్ కో డిసెంబర్ లో ఫిక్స్ చేయబోతున్నట్లుగా టాక్.
క్రిష్ట్మస్ స్పెషల్ గా డిసెంబర్ 24 న ఆచార్య మూవీ ని రిలీజ్ చేస్తే బావుంటుంది మేకర్స్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. ఒకటి రెండు రోజుల్లో ఆచార్య డేట్ పై క్లారిటీ రావొచ్చని.. ఆచార్య మూవీ రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించాడనికి కూడా టీం సిద్ధపడుతుంది అని తెలుస్తుంది. కేవలం చిరునే కాదు.. అటు రవితేజ, ఇటు బాలకృష్ణలు అఖండ, కిలాడీ డేట్స్ ఎప్పుడు ఇస్తారా అని ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి ఆచార్య క్రిష్టమస్ కి ఫిక్స్ అయితే.. మెగా ఫాన్స్ కి పండగే. ఇక ఆచార్య మూవీలో కాజల్ మెయిన్ హీరోయిన్ కాగా.. పూజ హెగ్డే రామ్ చరణ్ కి పెయిర్ గా నటిస్తుంది.