Advertisement
Google Ads BL

అప్పుడు యాడ్ షూట్.. ఇప్పుడు ఫోటో షూట్


మహేష్ బాబు హీరోగా తెరంగేట్రం చేసాక.. నమ్రత హీరోయిన్ గా సినిమాల్లో నటిస్తుంది. మహేష్ బాబు - నమ్రతలు వంశీ సినిమా కలిసి చేస్తున్నప్పుడే లవ్ చేసుకుని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. మహేష్ బాబు, నమ్రతతో పెళ్లి తర్వాత సినిమాల్లో బిజీ అవ్వగా.. నమ్రత ఘట్టమనేని ఇంటి కోడలిగా సినిమాలు, షూటింగ్స్ పక్కనపెట్టేసి తన ఇద్దరు పిల్లలను, మహేష్ బాబు ని చక్కగా చూసుకుంటుంది. కొన్నాళ్లుగా మహేష్ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్న నమ్రత.. మహేష్ తో కలిసి ఓ యాడ్ షూట్ లో పాల్గొనింది. మహేష్ - నమ్రత తమ పిల్లలు గౌతమ్, సితార లతో యాడ్ షూట్ లో మెరిశారు.

Advertisement
CJ Advs

సోషల్ మీడియాలో మహేష్ తన పిల్లలతో భార్య తో ఎంజాయ్ చేసే క్షణాలను షేర్ చేస్తుంటారు. మహేష్ భార్య గా, ఓ హీరోయిన్ గా నమ్రతకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇక తాజాగా నమ్రత మహేష్ లు ఒక మ్యాగజైన్ ఫొటో షూట్ నిమిత్తం ఇద్దరూ కలిసి స్టిల్స్ ఇచ్చారు. మహేష్ అండ్ నమ్రతలు చాలా స్టైలిష్ గా హలో మ్యాగజైన్ కోసం ఆ ఫోటో షూట్ చేసారు. ప్రస్తుతం మహేష్ - నమ్రతలు మ్యాగజైన్ షూట్ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. 

Mahesh Babu and Namrata Shirodkar make photoshoot:

Mahesh Babu and Namrata Shirodkar make first photoshoot in Hello magazine
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs